ఇక రంగు పడకుండా చికెన్ పకోడా
బనశంకరి: హోటళ్లు, వీధుల్లో విక్రయించే శాకాహార, మాంసాహార వంటకాలు బాగా కనిపించాలని వ్యాపారులు ఎరుపు, ఊదా వంటి కృత్రిమ రంగులను ఉపయోగిస్తుంటారు. ఆ రంగుల వల్ల ప్రజలకు అనారోగ్యం కలుగుతోందని ఆరోపణలు రావడంతో కృత్రిమ రంగుల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి నిషేధించింది.
ఆహార తనిఖీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 39 చికెన్ పకోడా, కబాబ్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబోరేటరీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 కబాబ్‌ల్లో హానికారకమైన కృత్రిమ రంగులను వాడినట్లు తేలింది. దీంతో కృత్రిమ రంగుల వాడకాన్ని సర్కారు నిషేధించింది. ఉల్లంఘనకు పాల్పడితే 7 ఏళ్ల జైలుశిక్ష , రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశముందని ఆహార సురక్షత నాణ్యత ప్రమాణాల శాఖ కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment