హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నడుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.