![Sundeep Kishan Help To Need For Food](/styles/webp/s3/article_images/2024/07/25/sandeep-kissan.jpg.webp?itok=FOMdqhal)
టాలీవుడ్ యంగ్ హీరోలలో సందీప్ కిషన్ చాలా ప్రత్యేకమనే చెప్పవచ్చు.. సినిమాలతో పాటు హోటల్ రంగంలోనూ రాణిస్తున్నాడు. ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. సినిమా రంగంలో అపజయాలు ఎదురైనా తన పంతాను మార్చుకుంటూ మళ్లీ విజయం సాధిస్తాడు. తమిళ్‌లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అక్కడ ఆయనకంటూ ప్రత్యేకమైన మమార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాడు.
చాలా మంది సినీ సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని వారు చెప్పే వరకు అభిమానులకు కూడా తెలియదు. వారు చేస్తున్న మంచి పనిని గోప్యంగానే ఉంచుతారు. తాజాగా హీరో సందీప్ కిషన్ రాయన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో తను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ తెలిపారు.
భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు. ప్రస్తుతం ఈ అంశం గురించి తన టీమ్ పరిశీలిస్తుందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. నెటిజన్లు కూడా సందీప్‌ను ప్రశంసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment