వర్క్‌ ఫ్రం హోటల్‌..! | Corporate Companies Intrest on Work From Hotel | Sakshi
Sakshi News home page

వర్క్‌ ఫ్రం హోటల్‌..!

Published Tue, Jul 7 2020 3:40 AM | Last Updated on Tue, Jul 7 2020 3:40 AM

Corporate Companies Intrest on Work From Hotel - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ విసిరిన పంజాకు గ్రేటర్‌లో కార్యకలా పాలు సాగిస్తున్న పలు ఐటీ, బీపీఓ కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసేందుకు (వర్క్‌ ఫ్రం హోం )అవకాశమిచ్చాయి. ఇప్పుడు మరో ట్రెండు నడుస్తోంది. సీనియర్‌ ఉద్యోగులు నగరంలో పలు త్రీస్టార్‌..ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో నుంచి పని చేస్తున్నారు. కీలక ఉద్యో గులు, ఆయా కార్పొరేట్‌ కంపెనీల సీఈఓలు, బిజి నెస్‌ హెడ్‌ల కోసం వర్క్‌ ఫ్రం హోటల్‌ కాన్సెప్ట్‌తో పలు హోటళ్లు ముందుకు వచ్చాయి.

దీంతో నగరం లో అతిథ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కరోనా కారణంగా దేశ, విదేశీ అతిథుల రాకపోకలు నగరానికి దాదాపుగా నిలిచిపోయాయి. ఆయా హోటళ్లలో గదుల బుకింగ్‌లు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త తరహా ఆలోచనలతో నగరం లోని పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు వర్క్‌ ఫ్రం హోటల్‌ కాన్సెప్ట్‌తో కార్పొరేట్లను ఆకర్షిస్తున్నాయి. 

హైఫై, వైఫై సదుపాయాలు..
కార్పొరేట్ల అవసరాలకు తగినట్లుగా... ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌లు, బోర్డు మీటింగ్‌లు, నూతన ప్రాజెక్ట్‌ల సదస్సులు, సమావేశాల నిర్వహణకు వీలుగా ఆయా హోటళ్ల యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక వీరి అవసరాలకు అనుగుణంగా వైఫై, ప్రింటర్, వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాల తోపాటు రుచి.. శుచితో పాటు హాట్‌హాట్‌గా హైజి నిక్‌ బాక్స్‌మీల్స్, స్నాక్స్, బేవరేజెస్‌ను అందిస్తు న్నాయి. ఆయా హోటళ్లలో పనిచేసే ఉద్యోగులు, అతిథుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చూడటం, శానిటైజేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తు న్నారు.

మరోవైపు లోనికి వచ్చే ముందే థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడం, అన్ని చోట్లా.. ఎల్లవేళలా శానిటైజర్లను అందుబాటులో ఉండేలా చూడడం, అసౌకర్యం కలిగించకుండా ఆతిథ్యం అందించేం దుకు సిబ్బంది సదా అందుబాటులో ఉండడం వంటి సదుపాయాల కారణంగా పలు కంపెనీలు ఈ నయా కాన్సెప్ట్‌కు విపరీతంగా ఆకర్షితులవుతుం డటం విశేషం. ఇందు కోసం రోజులు, గంటలు.. నెలల చొప్పున రూ. లక్ష నుంచి 25 లక్షల వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.

నగరంలో పలు హోటళ్లలో ఇదే ట్రెండ్‌..
ప్రధాన నగరంలోని సోమాజిగూడ, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్‌ , మాదాపూర్‌ సహా శివార్లలోని శంషాబాద్‌ నోవాటెల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో పలు కార్పొరేట్‌ సంస్థల సీఈఓలు, బిజినెస్‌ హెడ్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తమ హోటల్‌లో గత నెలరోజులుగా సుమారు 50 బుకింగ్‌లు జరిగినట్లు సోమాజిగూడాలోని పార్క్‌ హోటల్‌ జీఎం అనిరుధ్‌ ‘సాక్షి’కి తెలిపారు.

కరోనా కష్టకాలంలో హోటల్‌ల వ్యాపారం మందగించిన నేపథ్యంలో బిజినెస్‌ పెంచేందుకు ఇలాంటి వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్యాకేజీలతో కార్పొరేట్లను ఆకర్షిస్తున్నట్లు నోవాటెల్‌ హోటల్‌ జీఎం మనీష్‌ పేర్కొన్నారు. ఐటీ, బీపీఓ కంపెనీలతోపాటు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, నాన్‌బ్యాంకింగ్‌ ఆర్థిక సంస్థలు, నిర్మాణ రంగం, రియల్టీ తదితర రంగాలకు చెందిన బడా సంస్థలు సైతం తమ కార్యలయాల్లో కాకుండా ఇలా త్రీస్టార్, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుండటం మూలంగా పలు సంస్థల కీలక ఉద్యోగులు కూడా వర్క్‌ ఫ్రం హోటల్‌కు ముందుకువస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement