సేవా రుసుం ఇస్తే తీసుకోవాలి
• బలవంతం చేస్తే చర్యలు
• హోటల్ యాజమాన్యాలకు సర్కారు స్పష్టీకరణ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెస్టారెంట్లు, హోటళ్లలో సేవా రుసుము చెల్లించే అంశంపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. సర్వీసు చార్జీల చెల్లింపు వినియోగదారుల విచక్షణకే వది లేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్జీల వసూలు ను తప్పనిసరి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సేవలకు సంతృప్తి పడి ఇస్తే తీసుకోవాలిగానీ, బల వంతం చేస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం–1986 ప్రకారం చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.
రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ కోర్టుల్లో ఆహార పదార్ధాలను భుజించేం దుకు వెళ్లిన వినియోగదారులపై ఆయా హోటల్ నిర్వాహకులు సర్వీసు చార్జీలను వడ్డిస్తు న్నారు. రూ.కోటిన్నర టర్నోవర్ కలిగిన సంస్థలు బిల్లుపై 5 శాతం, రూ. కోటిన్నర పైబడిన హోటళ్లు 15 శాతం సేవా రుసుమును వసూలు చేస్తున్నారు. వినియోగ దారులు ఆందోళన వ్యక్తం చేసినన నేపథ్యం లో గతేడాది చివరలో కేంద్రం సర్వీసు చార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
బోర్డుపై టోల్ ఫ్రీ నంబర్ తప్పనిసరి
ఇకపై వాణిజ్య కార్యకలాపాలు నిర్వర్తించే సంస్థలు విధిగా తమ దుకాణం బోర్డు మీద 180042500333 నంబర్ పొందుపరచాలి. దుకాణదారులు మోసాలకు పాల్పడితే ఆ టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదిస్తే అధికారులు చర్యలు తీసుకుంటారు. ‘గ్రహక్ సువిధ కేంద్ర’ పేరిట కేంద్రం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించాలని జీహెచ్‌ఎంసీ, వాణిజ్యపన్నుల శాఖ, తూనికలు, కొలతలు, ఆహారభద్రత, కార్మికశాఖలకు జిల్లా పౌర సరఫరాలశాఖ లేఖ రాసింది.