
ట్రెండ్‌కి అనుగుణంగా మారాలనే మాట వినే ఉంటాం. దీన్నే మన టాలీవుడ్ సినీతారలు పాటిస్తున్నారు. ఎందుకంటే కేవలం సినిమాల్లో నటనపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఇతర వ్యాపారాలలోనూ అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ని పలువురు సీనీ సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు కూడా. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఉన్నారనే విషయం విదితమే. ప్రిన్స్ ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఉన్నారు.
కొన్నిసార్లు కథలు నచ్చితే ఆయన నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా మరో సరికొత్త వ్యాపారంలోకి మహేశ్ అడుగుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన మినర్వా గ్రూప్‌తో కలిసి భారీ స్థాయిలో రెస్టారెంట్‌ను మొదలుపెట్టాలని మహేశ్ అనుకుంటున్నారట. ఈ రెస్టారెంట్‌ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ప్రస్తుతం ఈ బిజినెస్‌మేన్ త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో పూజా హెగ్డే నటిస్తోంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది.
చదవండి: Jagapathi Babu: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన జగపతిబాబు
Comments
Please login to add a commentAdd a comment