బ్యాక్‌ టు హోమ్‌ | Mahesh Babu returns from Germany training trip | Sakshi
Sakshi News home page

బ్యాక్‌ టు హోమ్‌

Published Mon, Feb 5 2024 12:01 AM | Last Updated on Mon, Feb 5 2024 12:01 AM

Mahesh Babu returns from Germany training trip - Sakshi

మహేశ్‌బాబు జర్మనీ నుంచి హైదరాబాద్‌ తిరిగొచ్చారు. హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్‌ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఫారెస్ట్‌ అడ్వెంచరస్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాను కేఎల్‌ నారాయణ నిర్మించనున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫిట్‌నెస్‌ ట్రైనింగ్, ఓ వర్క్‌షాప్‌లో భాగంగా మహేశ్‌ బాబు ఇటీవల జర్మనీ వెళ్లవారు. ఈ ఫిట్‌నెస్‌ ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌లోని స్వగృహానికి చేరుకున్నారాయన. కాగా ఈ సినిమాలో హీరో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమయ్యేలా రాజమౌళి ప్లాన్‌ చేశారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. ఈ మూవీ గురించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement