
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఇటీవలె బిచ్చగాడు-2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన బిచ్చగాడు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించారు. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్‌గా నటించింది.
మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్‌గా మారారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు విచ్చేసి వెయిటర్‌గా సర్వ్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment