హైదరాబాద్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ మరో బిజినెస్ | Actress Rakul Preet Singh New Restaurant In Hyderabad | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: మొన్నే పెళ్లి.. ఇప్పుడు కొత్తగా ఫుడ్ బిజినెస్

Published Fri, Apr 12 2024 11:15 AM | Last Updated on Fri, Apr 12 2024 11:15 AM

Actress Rakul Preet Singh New Restaurant In Hyderabad - Sakshi

తెలుగులో చాలామంది హీరోహీరోయిన్లు.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వ్యాపారాల్లోనూ రాణిస్తుంటారు. పలువురు హీరోలకు హైదరాబాద్ లో పబ్స్ ఉన్నాయి. కొందరు హీరోయిన్లకు జిమ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాంటి వాళ్లలో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న ఈమె తాజాగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతుంది.

హీరోయిన్ గా తెలుగులో చరణ్, బన్నీతో సినిమాలు చేసిన రకుల్.. ఫిట్ నెస్ కి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ఇదే కాన్సెప్టుతో గతంలో జిమ్స్ ప్రారంభించింది. హైదరాబాద్, వైజాగ్ తదితర నగరాల్లో ఎఫ్ 45 పేరుతో రకుల్ కి జిమ్స్ ఉన్నాయి. చాలామంది తెలుగు స్టార్ వీటికి వెళ్తుంటారు కూడా.

(ఇదీ చదవండి: Yatra 2 In OTT: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'యాత్ర 2'.. స్ట్రీమింగ్ అందులోనే)

వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ రకుల్ ప్రీత్ పెట్టుబడులు పెట్టింది. హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగుపెట్టింది. 2019లో న్యూబూ‘పేరుతో బయోడీగ్రేడబుల్, రీ యూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు మరో రంగంలోకి అడుగుపెట్టబోతుంది. ఫుడ్ బిజినెస్ స్టార్ చేసింది.

హైదరాబాద్ ఆరంభం పేరుతో త్వరలో ఓ రెస్టారెంట్ ప్రారంభం కానుంది. ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన పుడ్ లభించనుంది.  మొన్నీ మధ్యే పెళ్లి చేసుకున్న రకుల్.. ఇప్పుడు కొత్తగా బిజినెస్ గా మొదలుపెట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన రెండు హిట్ సినిమాలు.. స్ట్రీమింగ్ అందులోనే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement