30న హోటళ్లు బంద్
Published Sat, May 27 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
కర్నూలు (టౌన్): దక్షిణ భారత దేశంలోని ఆరు రాష్ట్రాల హోటల్స్, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్స్ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఈనెల 30వ తేదీ హోటళ్లను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ కల్కూర వెల్లడించారు. శనివారం స్థానిక ఓ హోటల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎసీటీ (జనరల్ సేల్స్ టాక్సు) పేరుతో హోటల్ రంగంపై పన్ను భారీగా పెంచిందన్నారు. ప్రస్తుతం ఉన్న 5 శాతం నుంచి నాన్ ఏసీ రెస్టారెంట్‌కు 12 శాతం, ఏసీ రెస్టారెంట్‌కు 18 శాతం నిర్ణయించారన్నారు. దీంతో వినియోగదారులపై పెనుభారం పడుతుందన్నారు. ఇప్పటికే హోటల్ రంగంపై 5 శాతం విధించాలన్న డిమాండ్‌తో హోటల్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి,పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ చైర్మన్, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిలను కలిసి విన్నవించినట్లు చెప్పారు. ఫుడ్ సేఫ్టి యాక్ట్ సైతం హోటల్స్ యజమానులకు ఆందోళన కలిగించే విధంగా ఉందన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు హోటళ్లను బంద్ చేస్తున్నామని, ఈ అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని విన్నవించారు. సమావేశంలో హోటల్స్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ తిరుపతిరెడ్డి, హనుమంతరావు, సుధాకర్, రామకృష్ణ, శ్రీధర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement