ఈ నెల 30న హోటళ్లు బంద్‌ | Hotels bandh On 30th of this month | Sakshi
Sakshi News home page

ఈ నెల 30న హోటళ్లు బంద్‌

Published Mon, May 29 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

Hotels bandh On 30th of this month

తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ వెల్లడి
 
హైదరాబాద్‌: జీఎస్టీ చట్టంతో హోటల్‌ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న పన్ను.. నాన్‌ ఎసీ రెస్టారెంట్లకు 12 శాతం, ఎసీ రెస్టారెంట్లకు 18 శాతంగా నిర్ణయించడంతో హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతుం దన్నారు. ఇందుకు నిరసనగా ఆల్‌ ఇండియా హోటల్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు సౌత్‌ ఇండియా హోటల్స్‌ అసోసియేషన్‌లోని హోటళ్లు, తినుబండారాల వ్యాపారులు ఈ నెల 30న బంద్‌ పాటించాలన్నారు. 29వ తేదీ నుంచి 31 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సూచించారు.

జూన్‌ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హోటల్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ గౌరవ చైర్మన్‌ నాగరాజు, బేకర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బర్కత్‌ విలానీ, సెక్రటరీ జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ చట్టం ద్వారా హోటళ్ల వారిని  కొందరు అధికారులు వేధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రతినిధులు అశోక్‌ రెడ్డి, శ్రీనివాస్, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement