Telangana State Hotels Association
-
నేడు హోటళ్లు బంద్
-
ఈ నెల 30న హోటళ్లు బంద్
తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ వెల్లడి హైదరాబాద్: జీఎస్టీ చట్టంతో హోటల్ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఉందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సద్ది వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 5 శాతంగా ఉన్న పన్ను.. నాన్ ఎసీ రెస్టారెంట్లకు 12 శాతం, ఎసీ రెస్టారెంట్లకు 18 శాతంగా నిర్ణయించడంతో హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతుం దన్నారు. ఇందుకు నిరసనగా ఆల్ ఇండియా హోటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు సౌత్ ఇండియా హోటల్స్ అసోసియేషన్‌లోని హోటళ్లు, తినుబండారాల వ్యాపారులు ఈ నెల 30న బంద్ పాటించాలన్నారు. 29వ తేదీ నుంచి 31 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని సూచించారు. జూన్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ గౌరవ చైర్మన్ నాగరాజు, బేకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బర్కత్ విలానీ, సెక్రటరీ జగదీశ్వర్‌రావు మాట్లాడుతూ.. జీఎస్టీ చట్టం ద్వారా హోటళ్ల వారిని కొందరు అధికారులు వేధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
జీఎస్టీతో హోటల్ రంగం కుదేలే..
తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ఆందోళన సాక్షి, హైదరాబాద్: కేంద్రం తాజాగా ప్రతిపాదించిన వస్తుసేవల పన్ను(జీఎస్టీ)తో రాష్ట్రంలో సుమారు 40 వేల చిన్న, మధ్యతరహా హోటళ్లకు పెనుభారం తప్పదని తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీని నాన్ ఏసీ హోటళ్లపై 12%, ఏసీ రెస్టారెంట్లపై 18%, స్టార్ హోటళ్లపై 28 % వడ్డించడంతో పలు హోటళ్లను మూసేయాల్సిన దుస్థితి తలెత్తుతోందని చెబుతు న్నారు. జీఎస్టీ రేటును వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల హోటల్స్ అసోసియేషన్ ఈ నెల 30న బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో బంద్‌కు మద్దతిచ్చే అంశంపై తెలం గాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో త్వరలో సమావేశం కానున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎస్.వెంకట్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. చిన్న, మధ్యతరహా ఏసీ రెస్టారెంట్లపై జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. తాజా పన్ను విధానంతో పలు హోటళ్లు మూతపడే పరిస్థితిని రానుందని, దీంతో కోట్లాది మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. త్వరలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన ప్రకటించారు.