నారాయణగూడలోని ఓ హోటల్‌లో తనిఖీ చేస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి
కాచిగూడ: ‘‘ఈ నూనె ఏ కంపెనీది? ఎన్ని సార్లు వేడి చేశారు? ఈ నూనెతో ఏమేం వండుతున్నారు? మీ ఇంటిని ఇలాగే ఉంచుకుంటారా? హోటల్‌ని ఇంత అధ్వానంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? రోజు ఇక్కడే టీ తాగుతావా? ఇందులో వాడే పాలు, టీ పొడి నాణ్యమైనవేనా? మీ బేకరీకి పర్మిషన్ ఉందా? సోడాలో వాడే ఐస్ ఎక్కడి నుంచి తెస్తున్నావు’’? అంటూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆయా వ్యాపారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆహార తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన నారాయణగూడ వైఎంసీఏ రోడ్డులో ఉన్న ఆల్‌సబా రెస్టారెంట్, న్యూ బేక్‌జోన్, శ్రీ సాయికృష్ణ టిఫిన్ సెంటర్ తదితర వాటిలో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ వాడుతున్న నూనె, పిండి, రంగులు, మటన్, చికెన్, పాలు, చాయ్‌పత్తాతో పాటు మంచినీటిని సేకరించి పరీక్షించారు. పదార్థాలు కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్ల యజమాన్యాలు వైఖరిని మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆహార భద్రత చట్టంలో మార్పులు చేస్తున్నామని పదార్థాల విక్రయదారులు సేప్టీ మేజర్స్ పాటించాలని, అవసరానికి మించి కలర్స్ వాడొద్దని సూచించారు. మంత్రి వెంట ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ కె.శంకర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment