
న్యూఢిల్లీ : కన్నతల్లి అన్న ప్రేమ లేకుండా ఆమెతో అమానుషంగా ప్రవర్తించాడో కుమారుడు. ఆమెపై ఉమ్మి చివరకు జైలు పాలయ్యాడు. వివరాలు.. న్యూఢిల్లీకి చెందిన అనిల్ పాండే అనే వ్యక్తి 81 ఏళ్ల తన తల్లిని తరచుగా హింసకు గురిచేస్తున్నాడు. గురువారం కూడా తల్లితో గొడవపెట్టుకున్నాడు. ఆమెను తిడుతూ మీద ఉమ్మేశాడు. అతడి తమ్ముడు సీక్రెట్‌గా ఈ సంఘటనను వీడియో తీశాడు. అనంతరం వీడియోతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
తల్లికి సంబంధించిన ఓ ఆస్తి విషయంలో అనిల్ ఆమెతో గొడవపడుతున్నట్లు చెప్పాడు. ఆమె పెరాలసిస్‌తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment