కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్డర్ ఎస్ జైశంకర్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే జైశంకర్‌ను అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లికి తన ఓటు వేశాడు. ఈ విషయంలో జైశంకర్‌కు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి రూపంలో మూడు ఆప్షన్లు ఇవ్వగా.. విరాట్‌పైపు మొగ్గు చూపాడు.
ఫిట్‌నెస్ మరియు వైఖరి కారణంగా కోహ్లిను ఇష్టపడతానని జైశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ కారణాలు మినహాయించి సచిన్, గవాస్కర్లను పక్కకు పెట్టడానికి వేరే కారణాలు లేవని తెలిపాడు. సుశాంత్ సిన్హా యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లడుతూ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి ఇరగదీస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్‌లో ఉండటానికి అతని ఫిట్‌నెస్సే కారణమని అంతా అంటుంటారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్‌గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఫిట్‌నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్‌ను ఆదర్శంగా తీసుకుంటారు.
Question:- Virat Kohli or Sachin Tendulkar or Sunil Gavaskar? (Sushant Sinha YT).
External affairs Minister Dr Jaishankar:- "I have biased towards Virat Kohli because of his fitness, attitude. That's why I will pick Virat".pic.twitter.com/Y7ossf99CQ— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024
పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం విరాట్ ఫిట్‌నెస్‌కు ముగ్దులవుతుంటారు. ప్రపంచ క్రికెట్‌లో దృవతారగా వెలగడానికి విరాట్ ఫిట్‌నెస్సే కారణమనడం అతిశయోక్తి కాదు. మైదానంలో అతను ప్రదర్శించే దూకుడు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే విభిన్నమైన తత్వం విరాట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మంత్రులే కాక దేశాధినేతలు సైతం విరాట్‌ను అభిమానించడానికి అతని ఫిట్‌నెస్, ఆట పట్ల అతనికున్న అంకితభావమే కారణం.
ఇదిలా ఉంటే, విరాట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ 15 మ్యాచ్‌ల్లో 61.75 సగటున సెంచరీ, 5 అర్ధసెంచరీ సాయంతో 714 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. విరాట్.. జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా రెండోసారి టైటిల్ గెలవడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment