వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సాగిన చర్చల్లో మానవ హక్కుల అంశం ప్రస్తావనకు రాలేదని భారత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై జైశంకర్ తీవ్రంగా స్పందించారు. అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చించాల్సిన విషయం కాదని అన్నారు. అయితే చర్చ జరిగినప్పుడల్లా వాటి గురించి మాట్లాడేందుకు తాము వెనకాడబోమని, తప్పకుండా మాట్లాడతామని స్పష్టం చేశారు.
‘ప్రతి ఒక్కరికి భారత్‌పై ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండేందుకు అర్హులు. అలాగే మాకు కూడా వారిపై అభిప్రాయాలు ఉంటాయి. అమెరికాతో సహా ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై కూడా మాకు అభిప్రాయాలు ఉంటాయి. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మా అభిప్రాయాలు చెబుతాం’ అని గట్టి కౌంటర్ ఇచ్చారు.
చదవండి: ఆహారం ‘వృథా’లో టాప్ టెన్ దేశాలివే..
కాగా భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. ఇటీవలపరిస్థితులు గమనిస్తుంటే కొంతమంది పోలీసులు, అధికారులు, ప్రభుత్వాల వల్ల మానవ హక్కుల ఉల్లంఘణ పెరిగిందని వ్యాఖ్యనించారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం భారత్‌తో సంప్రదింపులు జరుపుతుంటామన్నారు.
పర్యటన ముగింపు సందర్భంగా అమెరికాలో భారతీయ పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రస్తుత సమావేశంలో మానవ హక్కుల అంశం చర్చకు రాలేదని జై శంకర్ తెలిపారు. గతంలో ప్రస్తావనకు వచ్చిందని, దానిపై చర్చించి, సమాధానం కూడా చెప్పినట్లు గుర్తుచేశారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాజకీయ సైనిక వ్యవహారాలపై చర్చించినట్లు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ఆహర భద్రత, శ్రీలంక సంక్షోభం, పాకిస్తాన్ వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు వెల్లడించారు.
చదవండి: రష్యాది నరమేధమే: బైడెన్
Comments
Please login to add a commentAdd a comment