
దుబాయ్: ‘గుజరాతీయులతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారితో చక్కగా కలిసిపోతా’ అని కేంద్ర మంత్రి ఫన్నీగా సమాధానం ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చమత్కారంగా ఇచ్చిన సమాధానం అక్కడి ఉన్నవారిలో నవ్వులు పూయించింది. ఆయన శనివారం దుబాయ్‌లో భారతీయ విద్యార్థులు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు.
#WATCH via ANI Multimedia | EAM Jaishankar's witty response to a student’s query ‘How he feels surrounded by Gujaratis’https://t.co/83kzBWgICR
— ANI (@ANI) December 9, 2023
ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానం ఇచ్చారు. గుజరాతీయుల మధ్య మీరు ఉండటం ఎలా అనిస్తోంది? అని ఓ విద్యార్థి అడగ్గా.. ‘గుజరాతీయుల మధ్యలో ఉండటం చాలా అసక్తికరంగా ఉంటుంది. ఇండియాలో అన్ని ప్రాంతాల నుంచి నాకు స్నేహితులు ఉన్నారు. గుజరాత్‌లోని పలు చోట్ల మా బంధువులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నేను అక్కడికి వెళ్లినప్పటి నుంచి దేశంలో మరే రాష్ట్రానికి వెళ్లనన్నిసార్లు నేను గురురాత్‌కు వెళ్లా. గుజరాతీయులతో నేను చక్కగా కలిసిపోతా’ అని అన్నారు.
ఇక 5 జూలై 2019న గుజరాత్ నుంచి బీజేపీ తరఫున జైశంకర్.. రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటుకు ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మోదీ కేబినెట్‌లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా పదవి బాధ్యలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment