ఏడాదిగా శృంగారానికి దూరం.. బిడ్డతో బలవంతంగా | Gujarat Woman Alleges Her Husband Forced Infant Daughter to Drink Beer | Sakshi
Sakshi News home page

ఏడాదిగా శృంగారానికి దూరం.. బిడ్డతో బలవంతంగా

Mar 31 2021 2:26 PM | Updated on Mar 31 2021 3:56 PM

Gujarat Woman Alleges Her Husband Forced Infant Daughter to Drink Beer - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం అని తేల్చి చెప్పాడు.

గాంధీనగర్‌: ఎన్నారై సంబంధం అంటే చాలు.. ఎగిరి గంతేసి.. ఎలాంటి ఆరాలు తీయకుండా భారీగా కట్నకానుకలు సమర్పించుకుని.. ఆనక వారి చేతిలో మోసపోయి కోర్టు మెట్లు ఎక్కేవారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు మన సమాజంలో. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి గుజరాత్లో వెలుగు చూసింది. ఎన్నారై భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ.. తనతో సఖ్యంగా ఉండటం లేదని.. పైగా ఏడాదిగా తనతో శృంగారం జరపలేదని.. అంతటితో ఊరుకోక తన బిడ్డ చేత బీర్‌ తాగిస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుజరాత్‌ పోలీసులను ఆశ్రయించింది.

ఆ వివరాలు.. సదరు మహిళకు 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్‌ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడు. దుబాయ్‌ వెళ్లాక అతడిలోని సైకో బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా  బాధితురాలిని వేధింపులకు గురి చేసేవాడు. ప్రతి రోజు తాగి నరకం చూపించేవాడు. అతంటితో ఊరుకోక భార్య చేత బలవంతంగా బీర్‌ తాగించేందుకు ప్రయత్నించేవాడు. ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్‌ తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం అని తేల్చి చెప్పాడు.

ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్‌ చెక్కెశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో అతడిపై ఫిర్యాదు చేసింది. 

చదవండి: ‘దృశ్యం’ సీన్‌: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement