NRI husbands
-
వేధించే ఎన్ఆర్ఐ భర్తలపై కొరడా
సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతుళ్లు జీవితాంతం గొప్పగా బతకాలన్న కోరికతో కొందరు తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలకు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటే.. దేశంకాని దేశంలో అడుగుపెట్టిన యువతుల్లో కొందరి పరిస్థితి దారుణంగా మారుతోంది. అదనపు కట్నం ఇవ్వట్లేదనో లేక ఇతర కారణాలను సాకుగా చూపించో భార్యలను కొందరు ఎన్ఆర్ఐ భర్తలు వేధిస్తున్నారు. అలా ఎన్ఆర్ఐ భర్తల చేతిలో దాడులు, గృహహింసకు గురవుతున్న అతివలకు రాష్ట్ర మహిళా భద్రత విభాగంలోని ఎన్ఆర్ఐ సెల్ అండగా నిలుస్తోంది.వ్యూహాత్మక చర్యలు చేపడుతూ వేధింపులకు పాల్పడే ఎన్ఆర్ఐ భర్తల మెడలు వంచుతోంది. నేరుగా ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు ఈ–మెయిల్, జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులు, షీ–టీమ్స్ వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ఫిర్యాదులు తీసుకుంటూ బాధితులకు తగిన న్యాయం అందేలా చేస్తోంది. వీలైన కేసుల్లో యువతుల కాపురాలు తిరిగి నిలబెట్టేలా కృషి చేస్తోంది. అలాగే ఎన్ఆర్ఐ పెళ్లిళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కలి్పస్తోంది. ఇప్పటివరకు ఎన్ఆర్ఐ సెల్‌కు వచ్చిన కేసుల్లో ఆరు జంటలను కలిపినట్లు అధికారులు తెలిపారు.అవసరమైతే పాస్‌పోర్టు సీజ్..వేధింపులకు పాల్పడే ఎన్ఆర్ఐ భర్తలను దారికి తెచ్చేందుకు వీలైన అన్ని మార్గాలను ఎన్ఆర్ఐ సెల్ ఉపయోగిస్తోంది. అవసరం మేరకు లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)లు జారీ చేయించడం, వారి పాస్‌పోర్టులు రద్దు చేయించడం కూడా చేస్తోంది.తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఎన్ఆర్ఐ సెల్ అందించే సాయం ఇదీ.. ⇒ బాధిత మహిళలకు లీగల్ గైడెన్స్. గృహహింసకు సంబంధించి కేసుల నమోదు. ⇒ భార్యలను వేధించే ఎన్ఆర్ఐ భర్తలను స్వదేశానికి రప్పించేలా ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం, కేంద్ర హోంశాఖ, విదేశాంగశాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశాల్లోని కాన్సులేట్ కార్యాలయాలకు లేఖలు రాయడం. వారు కేసుల విచారణను ఎదుర్కొనేలా చేయడం. ⇒ఒకవేళ బాధితురాలు విదేశాల్లోనే ఉంటే వారికి తగిన సాయం అందేలా అక్కడి ఎన్జీవోల సహకారం తీసుకోవడం. ⇒ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సిద్ధపడే వారి కుటుంబాలకు ప లు అంశాలపై పోస్టర్లు, బ్రోచర్లు, సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించడం. ⇒నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (ఎన్ఆర్ఐ) పెళ్లిళ్ల కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన పద్ధతులపై పోలీసులకు (స్టేషన్ హౌస్ ఆఫీసర్లు) శిక్షణ, కేసుల నిరంతర పర్యవేక్షణ. 2019 జూలై నుంచి ఈ ఏడాది జూలై 31 వరకు ఎన్ఆర్ఐ సెల్ పనితీరు ఇలా..⇒మొత్తం ఫిర్యాదులు: 1,801⇒నమోదు చేసిన కేసులు: 450⇒రాజీ కుదిరిన, దర్యాప్తు పూర్తయిన కేసులు:150 ⇒ఎల్ఓసీల జారీకి ప్రతిపాదించిన కేసులు:216⇒జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్లు:68⇒ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టులు రద్దు ఉదంతాలు:19⇒ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టులు కోర్టు జప్తు చేసినవి: 23⇒స్వదేశానికి వచ్చి కోర్టుల్లో విచారణ ఎదుర్కొన్న నిందితులు:47 -
అసలు వీడు మనిషేనా?.. విదేశాల్లో భార్యను ఒంటరిగా వదిలేసి..
సాక్షి, హైదరాబాద్: ‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అంటారు. కానీ, ఓ ప్రవాస ప్రబుద్ధుడు భార్య చదువు ఆర్థిక భారంగా భావించాడు. ఉన్నత చదువులు చదివి..మంచి ఉద్యోగం సంపాదించి భర్తకు చేదోడుగా నిలుద్దామనుకున్న ఆమె కలలను కల్లలు చేశాడు. విదేశాల్లో ఒంటరిగా వదిలేసి..తాపీగా చేతులు దులుపేసుకున్నాడు. అల్లుడికి నచ్చచెబుదామని పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో.. దిక్కుతోచని స్థితిలో బాధితురాలి తల్లిదండ్రులు గచ్చి»ౌలిలోని మహిళా పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు ఇలా.. మాదాపూర్ జోన్‌కు చెందిన కావ్య (పేరు మార్చాం) స్థానికంగా డిగ్రీ పూర్తి చేసింది. దాదాపు ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు మ్యాట్రిమోని సైట్ల ద్వారా పెళ్లి సంబంధం వెతికి అమెరికాలో స్థిరపడిన కిషోర్ (పేరు మార్చాం)కు ఇచ్చి పెళ్లి చేశారు. కిషోర్ యూఎస్‌లోని వర్జీనియాలో ఉద్యోగి కావటంతో.. పెళ్లి తర్వాత ఈ యువ జంట అక్కడికి వెళ్లింది. కొన్నాళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. మధ్యలో ఆపేసిన చదువును పూర్తి చేద్దామని భావించిన కావ్య అక్కడే ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరింది. దీంతో భర్త అసలు రంగు బయటపడింది. భార్య చదువు ఆర్థిక భారంగా మారిందని కిషోర్ తనని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. దీనిపై ఇద్దరి మధ్య తగాదాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని ఇండియాలో ఉన్న తల్లిదండ్రులకు వివరించింది కావ్య. దీంతో పలుమార్లు ఫోన్లో అల్లుడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. అల్లుడి తల్లిదండ్రులను కలిసి వారి కొడుక్కి సర్దిచెప్పమని చెబుదామని ప్రయత్నిస్తే వారి నుంచి కూడా స్పందన లేదు. దీంతో చేసేదిలేక గచ్చిబౌలిలోని మహిళా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిషోర్ తల్లిదండ్రులను విచారించగా.. వాళ్లిద్దరి మధ్య అవగాహన సరిగా లేదని చెప్పి చేతులు దులిపేసుకున్నారు. దీంతో విదేశంలో కూతురు ఒంటరైపోయిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎన్నారై సంబంధం ఇలా పెటాకులు కావటంతో అమ్మాయి చదువు, వసతి ఇతరత్రా ఖర్చులన్నీ తల్లిదండ్రులే భరిస్తున్నారు. ఎన్నారై బంధానికి ఏడు సూత్రాలు: ► ఎన్నారైల ఎంపిక, పెళ్లి చేసే విషయంలో తొందరపడకూడదు. ► వరుడు/వధువు అతని కుటుంబ సభ్యుల నేపథ్యాన్ని ధ్రువీకరించుకోవాలి. ► మ్యారేజ్ బ్రోకర్లు, బ్యూరోలపై ఆధారపడి సంబంధాన్ని అంగీకరించకూడదు. ► ప్రవాసుల వివాహాన్ని తప్పనిసరిగా నమోదు చేయాలి. ► విదేశాలలో చట్టపరమైన హక్కులు, అర్హతలు, అత్యవసర సేవల గురించి తెలుసుకోవాలి. ► వధువు వీసా, పాస్‌పోర్ట్, ఇతరత్రా ముఖ్యమైన కాపీలను వధువు కుటుంబం లేదా దగ్గరి స్నేహితుల వద్ద ఉంచాలి. ► ఎన్నారై వరుడి పాస్‌పోర్ట్, విదేశీయుల నమోదు కార్డు, సామాజిక భద్రత నంబరు, గత మూడు సంవత్సరాలకు సంబంధించిన పన్ను రిటర్న్‌లు, బ్యాంకు పత్రాలు వంటి కీలకమైన పత్రాలను తనిఖీ చేయాలి. -
ఎన్.ఆర్.ఐ భర్తల మోసం చెల్లదు
పంజాబ్‌లో‘హనీమూన్బ్రైడ్స్’ అనే మాట వినిపిస్తూ ఉంటుంది.అంటే పెళ్లి చేసుకున్న ఎన్.ఆర్.ఐలుకాపురానికి తీసుకెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగాకాపురం చేసి ఆ తర్వాత పెళ్లికూతుళ్లను పుట్టింటికి తరిమేస్తారు.సత్వీందర్ కౌర్ కూడా అలాంటి బాధితురాలే.కాని ఆమె ఊరికే ఉండలేదు.లూధియానాలో ఒక సంస్థ స్థాపించిఎన్ఆర్ఐ బాధితమహిళలకు న్యాయం జరిగేలా చూసింది.న్యాయం జరగాలంటే ఏం చేయాలో కూడా చెబుతోంది. పంజాబ్, హరియాణాలలో ఎన్.ఆర్.ఐ భర్తలు మోసం చేసిన భార్యల సంఖ్య ప్రస్తుతం ఎంత ఉంటుందో ఊహించండి. 32,000. పెళ్లి చేసుకుని ఉద్యోగాలు విదేశాలలో తెచ్చుకుని మాయమైన ఎన్.ఆర్.ఐలు కొందరైతే విదేశాల్లో ఉంటూ ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకొని కొన్నాళ్లు కాపురం చేసి ఆ తర్వాత ఉడాయించిన వాళ్లు కొందరు. వీరి గురించి ఆరా తీస్తూ, ఎదురు చూస్తూ, వారిని శిక్షించాలని ప్రయత్నిస్తూ పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగే ఈ వివాహితులను అక్కడ ‘హనీమూన్ బ్రైడ్స్’ అంటూ ఉంటారు. విషాదం ఏమంటే వీరి సగటు వయసు 22 నుంచి 65 వరకూ ఉండటం. ముప్పై ఏళ్ల క్రితం పెళ్లి చేసుకుని విదేశాలకు పా రిపోయిన భర్తల కోసం ఎదురు చూస్తున్న మహిళలు ఇంకా అక్కడ ఉన్నారు. వారందరికీ ఒక ఓదార్పు లూధియానాలో ‘అబ్ నహీ’ సంస్థను నడుపుతున్న 41 ఏళ్ల సత్వీందర్ సింగ్. స్వయంగా బాధితురాలు లూధియానాకు చెందిన సత్వీందర్ సింగ్ టీచర్‌గా పని చేసేది. టీచర్ సంబంధమే వస్తే 2009లో వివాహం చేసుకుంది. ఒక సంవత్సరం తర్వాత భర్త విదేశాలలో ఉద్యోగం వచ్చిందని జార్జియా వెళ్లాడు. అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్లాడు. సత్వీందర్ అత్తారింటిలోనే ఉండిపోయింది. ఐదేళ్ల తర్వాత 2015లో తిరిగి వచ్చిన భర్త ఆమెను అత్తారింటి నుంచి ఒక అద్దె ఇంటికి మార్చి ఒక నెల ఉండి మళ్లీ ఉక్రెయిన్‌కు వెళ్లిపోయాడు. త్వరలో వచ్చి తీసుకెళతాను అనే దొంగ హామీ మీద. కాని ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడంతోటే ‘ఇక నీకూ నాకూ సంబంధం లేదు’ అని ఫోన్ చేసి చెప్పేశాడు. సత్వీందర్ వెంటనే అత్తామామల దగ్గరకు వెళితే వాళ్లు ముఖాన తలుపులు వేసేశారు. ఒక సంవత్సరం పా టు చేష్టలుడిగి ఉండిపోయిన సత్వీందర్ ఆ నిద్ర నుంచి మేల్కొని న్యాయం కోసం గట్టిగా పట్టుబట్టింది. భర్త మీద, అత్త మామల మీద సెక్షన్ 406, 498ల కింద కేసు పెట్టింది. కోర్టులో మెయింటెనెన్స్ కేసు వేస్తే నెలకు 10 వేలు మంజూరయ్యాయి. 2018లో భర్త పా స్పోర్ట్ సీజ్ అయ్యేలా చూసింది. ఇవన్నీ చిన్న విజయాలు కావు. తనలాంటి వారి కోసం ఆ సమయంలో కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర తన లాంటి వివాహితలు మరికొంత మంది కనిపించేవారు సత్వీందర్‌కు. ‘ఇంతమంది ఉన్నారా... వీరందరి కోసం ఏదైనా చేయాలి’ అని ‘అబ్ నహీ’ సంస్థ స్ధాపించింది. చిన్న చిన్న సమావేశాలు పెట్టి ఇలాంటి బాధిత మహిళలను సమీకరించడం మొదలెట్టింది. ఈమె చేస్తున్న పని ఆ నోటా ఈ నోటా తెలిసి బాధితులు రావడం మొదలెట్టారు. అయితే ఇది అంత సులభం కాదు. పా రిపోయిన కుర్రాళ్ల కుటుంబాలు ఈమె చేసే నిరసన కార్యక్రమాలకు, పెడుతున్న కేసులకు ఆగ్రహించేవి. శాపనార్థాలు పెట్టేవి. తన్నబోయేవి. అయినా సత్వీందర్ జంకకుండా తన పోరాటాన్ని కొనసాగించింది. ఎన్.ఆర్.ఐ సెల్స్ ద్వారా మహిళా కమిషన్ ద్వారా బాధితులకు మద్దతు దొరికేలా చేసేది. అంతేకాదు, జాతీయ గురుద్వారా కమిటీ ద్వారా విదేశాలలో ఉన్న గురుద్వారాలకు ఇలా పా రిపోయిన వరుల వివరాలు తెలుపుతూ తాకీదులు అందేలా చేసింది. అంటే అక్కడ ఉన్న వారి గురించి కనీసం అక్కడ ఉన్న పంజాబీలకు తెలిసేలా చేయగలిగింది. కొందరు భర్తలు ఏ దేశాల్లో అయితే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడి లీగల్ సెల్స్‌కు అదే పనిగా ఈ మెయిల్స్ పంపి ఫిర్యాదు చేస్తుంది. విదేశాంగ శాఖకు పదే పదే వినతి చేయడం వల్ల ఆ శాఖ కూడా రంగంలో దిగి ఇలాంటి కేసులు నమోదైన భర్తల పా స్పోర్ట్ల వివరాలను సేకరించి అవసరమైతే సీజ్ చేసే చర్యలు చేస్తోంది. ఇప్పటికి 700 మంది సత్వీందర్ సింగ్ ఇప్పటికి 700 మంది వివాహితలకు ఏదో ఒక మేర న్యాయం అందేలా చేసింది. అలాగే భర్తలను విడిచిపెట్టి ఉడాయించిన భార్యల బాధితులైన 40 మంది భర్తలకు కూడా న్యాయం అందడానికి పోరాడుతూ ఉంది. ‘భార్యను విడిచి వెళ్లిపోయిన భర్తల కేసుల్లో ఇరుపక్షాలను కూచోబెట్టి సమస్య కనుక్కుంటే చాలా కేసులు విడిపోయే దాకా వెళ్లకుండా ఆపొచ్చు. కొన్నింటిలో మాత్రం మోసగాళ్లు ఉంటారు. వారికి శిక్ష పడేలా చేయాలి.’ అంటుంది సత్వీందర్. సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ ద్వారా బాధితులను గుర్తించి వారికి సహాయం అందేలా చేయడానికి ప్రయత్నిస్తోందామె. ‘మన పోలీసులు దేశంలో లేకుండా పోయిన వారంటే ఏమీ చేయలేము అన్నట్టు చూస్తుంటారు. కాని అలా విదేశాలకు పారిపోయిన వారికి తప్పకుండా శిక్ష పడుతుంది అనే విధంగా చర్యలు ఉంటే ఎన్.ఆర్.ఐల ఆగడాలు ఆగుతాయి’ అంటుంది సత్వీందర్. పంజాబ్, హరియాణాలలో అయితే సత్వీందర్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇలాంటి బాధితులు ఎందరు ఉన్నారో తెలియాల్సి ఉంది. వారి కోసం సత్వీందర్లాంటి వాళ్ల అవసరం తప్పక ఉంటుందని వేరే చెప్పాలా? -
హరర్ మూవీలు చూపించి.. అమెరికా అల్లుడి వికృత చేష్టలు
సాక్షి, బంజారాహిల్స్: ఎన్ఆర్ఐ భర్త మోసం చేయడంతో బాధిత యువతి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా మంగళవారం యూసుఫ్‌గూడ ఎల్ఎననగర్లోని అత్తింటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన మారి మహేష్ 2022 మే 26న రామేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది జూన్ 18న యూఎస్ఏలోని టెక్సాస్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ మర్నాటి నుంచే నీ వల్ల కట్నం తక్కువగా వచ్చింది మరొకరిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదంటూ గొడవ పడుతున్నాడు. రామేశ్వరిని వదిలించుకోవాలని పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. హరర్ మూవీలు చూపించేవాడు. బలవంతంగా హుక్కా తాగించేవాడు. ఆ తర్వాత రెండు నెలలకే గత ఆగస్టు 18న రామేశ్వరితో పాటు ఇండియాకు వచ్చిన మహేష్ ఆమెను దోమల్‌గూడలోని పుట్టింట్లో వదిలేసి ఆ తెల్లవారే అమెరికా వెళ్లిపోయాడు. ఆమెకు తెలియకుండానే రానుపోనూ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తనను తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే టికెట్ దొరకడం లేదంటూ బుకాయించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు గత అక్టోబర్ 23న అమెరికాకు టికెట్ బుక్ చేసి రామేశ్వరిని భర్త వద్దకు పంపించారు. రామేశ్వరి ఫ్లైట్ ఎక్కగానే ఈ విషయమై ఆమె తండ్రి మహేందర్ అల్లుడికి ఫోన్ చేయగా తనకు ఏం సంబంధం లేదని ఆమె ఎవరో తనకు తెలియదంటూ అసభ్యంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆమె అమెరికా వెళ్లాక కూడా ఘర్షణ పడటమేగాక విడాకుల నోటీసుపై సంతకం కూడా పెట్టించాడు. ఈ విషయమే రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా తమపై దాడి చేయడానికి వచ్చారంటూ మహేష్ తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రోజులు గడిచినా మహేష్‌ను, ఆమె తల్లిదండ్రులను పోలీసులు పిలవకపోవడంతో రామేశ్వరి తన తల్లిదండ్రులతో కలిసి అత్తమామను కలవడానికి వెళ్లగా ఇంటికి తాళం వేసి బయటికి గెంటేశారు. తన ఇంటికి తనను రావొద్దని చెప్పడానికి వారి ఏం హక్కు ఉందంటూ బాధితురాలు అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని, తక్షణం మహేష్‌ను అమెరికా నుంచి పిలిపించాలని కోరింది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
ఏడాదిగా శృంగారానికి దూరం.. బిడ్డతో బలవంతంగా
గాంధీనగర్: ఎన్నారై సంబంధం అంటే చాలు.. ఎగిరి గంతేసి.. ఎలాంటి ఆరాలు తీయకుండా భారీగా కట్నకానుకలు సమర్పించుకుని.. ఆనక వారి చేతిలో మోసపోయి కోర్టు మెట్లు ఎక్కేవారు ఇప్పటికి చాలా మంది ఉన్నారు మన సమాజంలో. తాజాగా ఈ కోవకు చెందిన కేసు ఒకటి గుజరాత్లో వెలుగు చూసింది. ఎన్నారై భర్త అదనపు కట్నం కోసం వేధిస్తూ.. తనతో సఖ్యంగా ఉండటం లేదని.. పైగా ఏడాదిగా తనతో శృంగారం జరపలేదని.. అంతటితో ఊరుకోక తన బిడ్డ చేత బీర్ తాగిస్తూ సైకోలా ప్రవర్తిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ గుజరాత్ పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు.. సదరు మహిళకు 2016లో వివాహం అయ్యింది. ఏడాది తర్వాత భర్తతో కలిసి ఆమె దుబాయ్‌కు వెళ్లింది. ఇండియాలో ఉన్నన్ని రోజులు తనను బాగానే చూసుకున్న భర్త దుబాయ్ వెళ్లిన నాటి నుంచి హింసించడం ప్రారంభించాడు. దుబాయ్ వెళ్లాక అతడిలోని సైకో బయటకు వచ్చాడు. అదనపు కట్నం తేవాల్సిందిగా బాధితురాలిని వేధింపులకు గురి చేసేవాడు. ప్రతి రోజు తాగి నరకం చూపించేవాడు. అతంటితో ఊరుకోక భార్య చేత బలవంతంగా బీర్ తాగించేందుకు ప్రయత్నించేవాడు. ఎంత సైకోలా ప్రవర్తించేవాడంటే రెండేళ్ల తన కుమార్తె చేత బీర్ తాగించేవాడు. ఇక ఏడాదిగా భార్యతో శృంగారానికి కూడా దూరంగా ఉంటున్నాడు. తాను అడిగినంత కట్నం ఇస్తేనే కాపురం అని తేల్చి చెప్పాడు. ఇక బిడ్డకు, బాధితురాలికి ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకునేవాడు కాదు. ఆస్పత్రికి తీసుకెళ్లడం.. మందులిప్పించడం వంటివి చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో భర్తతో కలిసి ఇండియాకు వచ్చింది బాధితురాలు. భర్త ఆమెను తన పుట్టింట్లో వదిలేసి దుబాయ్ చెక్కెశాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన మహిళ అహ్మదాబాద్ పోలీస్ స్టేషన్లో అతడిపై ఫిర్యాదు చేసింది. చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం -
ఆ ఎన్నారై భర్తలపై జూలైలో విచారణ
న్యూఢిల్లీ: భార్యలను వదిలేసిన, కట్నం కోసం వేధించిన ఎన్నారై భర్తలను తప్పనిసరిగా అరెస్టు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. బాధిత మహిళల తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీనియర్ న్యాయవాది కొలిన్ గొన్సాల్వెజ్ సోమవారం జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎస్.రామసుబ్రమణియన్ల ధర్మాసనానికి నివేదించారు. ఈ అంశంపై తాము వేరుగా పిటిషన్ వేశామనీ, దీనిపై న్యాయస్థానానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రవాసీ లీగల్ సెల్ తరఫున సంజయ్ హెగ్డే పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..ఈ పిటిషన్లపై జూలైలో విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం బదులిచ్చినట్లు కూడా ధర్మాసనం తెలిపింది. కట్నం కోసం వేధించిన, భార్యలను వదిలివెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై చర్యలు తీసుకోవాలంటూ కొందరు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వేరుగా ఉంటున్న తమ భర్తలను అరెస్టు చేయాలనీ, ఈ విషయంలో విదేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాల ద్వారా తమకు సాయం అందించాలని వారు తమ పిటిషన్లలో అభ్యర్థించారు. ఇటువంటి కేసుల్లో సదరు భర్తలపై ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే లుకౌట్ నోటీసులు జారీ చేసి, అరెస్టు చేయాలంటూ వారి తరఫు న్యాయవాది సత్య మిత్ర కోరారు. ‘ఇటువంటి కేసుల్లో సదరు ఎన్నారై భర్తలు, న్యాయస్థానానికి హాజరు కాకుండా తప్పించుకోవడం, భారత్‌కు తిరిగి రాకపోవడం జరుగుతున్నాయి. ఈ విషయంలో వారి పాస్‌పోర్టు లను స్వాధీనం చేసుకుని, స్వదేశానికి రప్పించేం దుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆ పిటిషన్లలో కోరారు. ఇందుకోసం బాధితుల పక్షాన మానవీయ దృక్పథంతో పనిచేసేలా చూడాలని పేర్కొన్నారు. -
ఎన్నారై భర్తలు వేధిస్తే సమాచారమివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారై భర్తలు వేధిస్తున్నారని కుమిలిపోవద్దని.. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా బాధిత మహిళలు ఎన్నారై సెల్‌ను సంప్రదించవచ్చని విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఏడీజీ స్వాతి లక్రా చెప్పారు. బాధిత మహిళలకు తమ వంతుగా చట్టపరమైన సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఎన్నారై భర్తల వేధింపులు–గృహహింసపై పరిష్కారం చూపేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించిన వర్చువల్ వర్క్‌షాప్‌నకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ వెబినార్‌లో 80 మందికిపైగా ఫిర్యాదుదారులు/బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. గతేడాది సెప్టెంబర్ 17న విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎన్నారై సెల్‌కు అద్భుతంగా పనిచేస్తుందన్నారు. లాక్‌డౌన్‌లోనూ ఎన్ఆర్ఐ సెల్ వాట్సాప్ నంబర్‌కు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఎన్నారై భర్తల వల్ల వేధింపులు, గృహహింస ఎదుర్కొంటున్న మహిళలకు పలు న్యాయ సాయమందిస్తూ పరిష్కారాలు చూపిస్తున్నామని తెలిపారు. బాధితులు ఏ దేశంలో ఉన్నా నిరాశ చెందకుండా.. ఎన్ఆర్ఐ సెల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. డీఐజీ బడుగుల సుమతి మాట్లాడుతూ.. ఇప్పటివరకు ఎన్నారై సెల్‌కు 101 ఫిర్యాదులు రాగా అందులో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నామన్నారు. 8 కేసుల్లో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని, ఏడుగురి పాస్‌పోర్టులు కోర్టుకు సమర్పించామని, 44 కేసుల్లో నిందితులను భారత్‌కు రప్పించేలా ఒత్తిడి చేసేందుకు వారు పనిచేసే కంపెనీలకు లేఖలు రాశామని వివరించారు. యూకేలోని వెన్ ఎన్జీవోకు చెందిన గీతా మోర్ల, చికాగో నుంచి చాందిని మాట్లాడుతూ.. ఎన్నారై భర్తల విషయంలో వేధింపులు ఎదు ర్కొంటున్న బాధితులకు చట్టపరంగా సాయం అందజేస్తామని ముందుకొచ్చారు. -
కేసుల్లో సత్వర విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఆర్ఐ భర్తల వేధింపుల కేసులను వేగంగా విచారించి నిందితులకు తగిన శిక్ష పడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో సమస్యలు, మోసాల పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సహకారం, సమన్వయానికి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గురువారం కన్వర్జెన్స్ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. నగరంలోని ఎన్ఆర్ఐ సెల్‌తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా పోలీస్ స్టేషన్లలో 586 ఎన్ఆర్ఐ వైవాహిక సంబంధిత ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 2019 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్లోనే 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70పై కేసులు నమోదు చేశామని, వీటిలో 41 విచారణలోనూ ఉండగా, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. మరో 32 కేసులు నాన్ బెయిలబుల్‌గా నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులను సమర్థంగా విచారించేందుకు దర్యాప్తు అధికారులకు వెసులుబాటు ఉండేలా ఎస్.ఓ.పీలను రూపొందించామని వివరించారు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం నమోదైన మొత్తం 586 ఎన్.ఆర్.ఐ కేసులలో అత్యధికంగా 248 కేసులు హైదరాబాద్ కమిషనరేట్‌లో, 99 కేసులు రాచకొండ పరిధిలో,99 సైబరాబాద్ పరిధిలో, వరంగల్‌లో 42, కరీంనగర్ లో 21, నిజామాబాద్‌లో 8 , నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసుల చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఆరు, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఐదు కేసుల వంతున నమోదయ్యాయని వివరించారు. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్‌శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల సామాన్యుల్లో పోలీసులపై ఎలా నమ్మకం ఏర్పడిందో, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు అనంతరం ప్రవాస భారతీయులు చేసే వివాహాల సంబంధిత మోసాల్లో బాధితుల్లో అంతే భరోసా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. విదేశీ భర్తల కేసుల విషయంలో ఎన్ఆర్ఐ సెల్ బాధితులు, విచారణసంస్థల మధ్య వారధిలా పనిచేస్తోందన్నారు. అనంతరం ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియో, కరపత్రాన్ని విడుదల చేశారు. పలు ఎన్నారై వివాహ కేసుల్లో రాజీ కుదిరి ఒక్కటైన జంటలను ఈ సందర్భంగా వేదికపై సత్కరించారు. -
ఎన్ఆర్ఐ భర్త శారీరకంగా వేధింపులు
జవహర్‌నగర్: భార్యను కాపురానికి తీసుకెళ్లకుండా వేధిస్తున్న ఓ ఎన్ఆర్ఐ భర్తపై జవహర్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కౌకూర్‌లో ఉంటున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సాయిమాధవికి 2013లో ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానంకు చెందిన శేరు వినయ్‌తో వివాహం జరిగింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత వినయ్ ఫ్రాన్స్‌కు తిరిగి వెళ్లిపోయాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో టూరిస్ట్ వీసాపై ప్రాన్స్ వెళ్లిన సాయిమాధవి కొద్దిరోజుల పాటు అక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె భర్త వినయ్, అత్తింటి వారు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడంతో 2014 జులైలో కౌకూర్‌లోని సోదరుడి ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి తీసుకెళ్లకుండా భర్త వినయ్ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితురాలు ఆదివారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెనమలూరులో ఎన్ఆర్ఐ భర్త చీటింగ్
-
ఎన్నారై భర్తలూ.. మీ ఆగడాలకు ఇక చెక్!
‘నాకు అమెరికాలో వర్క్ వీసా వచ్చింది.. నువ్వు నాతో అక్కడికి రావాలంటే అదనపు కట్నం తీసుకురా.. లేదంటే నా దగ్గరికి ఎప్పటికీ రాలేవు’అంటూ తన భార్యకు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భర్త తెగేసి చెప్పాడు. ‘నేను ఇక్కడ మరో పెళ్లి చేసుకున్నా.. భవిష్యత్తులో ఇండియాకు రాలేను.. బై’అంటూ మరో భర్త తెగదెంపులు చేసున్నాడు. ‘మన పెళ్లి ఆస్ట్రేలియాలో జరిగింది, నువ్విపుడు ఇండియాలో ఉన్నావు. నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేవు’అంటూ వెటకారంగా మాట్లాడాడు మరో ఎన్నారై భర్త. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎన్నారై భర్తల కేసుల్లో ఇలాంటి వేధింపులు వింటూ ఉంటాం. ఇకపై ఇలాంటి ఆటలు సాగవు. భార్యలను ఇండియాలోనే వదిలేసి, అదనపు కట్నం లేదా ఇతర కారణాలను సాకుగా చూపి వేధింపులకు పాల్పడే వారి ఆగడాలకు పోలీసులు చెక్ చెప్పనున్నారు. తాజాగా భార్యలపై వేధింపులకు దిగుతున్న 45 మంది భర్తల పాస్‌పోర్టులను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉండి భార్యలను వేధించడం ఇకపై కుదరదంటూ గట్టి సంకేతాలు పంపింది. ఈ తరహా బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే పార్లమెంటులో బిల్లు పెట్టిన కేంద్రం లోక్‌సభలో దాన్ని ఆమోదింపజేసుకుంది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంది. కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరిగిపోతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బిల్లులో ఏముంది? విదేశాల్లో ఉంటూ భారతదేశంలో ఉన్న భార్యలను వేధించే భర్తల ఆటకట్టించాలన్న కేంద్రం ఈ మేరకు ఓ చట్టం తెచ్చేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర మహిళా–శిశు సంక్షేమ, విదేశాంగ, హోం, న్యాయశాఖలు సంయుక్తంగా ఈ బిల్లుకు రూపకల్పన చేశాయి. దీని ప్రకారం వివాహం భారత్‌లో జరిగినా, విదేశాల్లో జరిగినా వేధింపులకు పాల్పడే ఎన్నారై భర్తలు ఇకపై తప్పించుకోలేరు. భారతీయ మహిళకు చట్టపరంగా మరింత రక్షణ కల్పించాలన్నదే ఈ బిల్లు ధ్యేయం. ఇందుకోసం పాస్‌పోర్ట్ యాక్ట్ 1967, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973లకు పలు మార్పులు చేసి బలోపేతం చేశారు. వివాహం జరిగిన 30 రోజుల్లో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలి. దీని ద్వారా చట్టపరమైన పలు రక్షణలు మహిళలకు చేకూరతాయి. బలోపేతం చేసిన పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం.. విచారణకు హాజరుకాని ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్ సీజ్ చేయడానికి, సీఆర్పీసీ 1973 ద్వారా కోర్టుకు హాజరుకాని వారి ఆస్తులను సీజ్ చేసే వీలు కల్పిస్తాయి. మన రాష్ట్రంలో పరిస్థితి ఇదీ.. తెలంగాణలోనూ ఎన్నారై భర్తలపై 498–ఎ కేసులు నమోదవుతున్నాయి. వీరిలో విచారణకు హాజరుకాకపోయినా, సహకరించకపోయినా.. వారిపై పోలీసులు లుక్అవుట్ (ఎల్ఓసీ) నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో 232 మంది ఎన్నారై భర్తలపై లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఏటేటా ఈ నోటీసుల సంఖ్య పెరుగుతుండటం కాస్త ఆందోళన లిగిస్తున్నా.. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో బాధితుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ నోటీసులు జారీ చేశాక, ఇక ఆ వ్యక్తి ఏ అంతర్జాతీయ విమానాశ్రయం, నౌకాశ్రయాల ద్వారా ప్రయాణం చేయలేరు. ఫలితంగా వారు పోలీసులకు చిక్కడమే కాకుండా తరువాత ఇంటర్‌పోల్ సాయంతో వారిని తిరిగి మన దేశానికి తీసుకువచ్చే వీలుంటుంది. బాధితులు ముందుకు రావాలి.. ఎన్నారై భర్తల విషయంలో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. వివాహం విదేశాల్లో జరిగినా, ఇండియాలో జరిగినా.. ఇక్కడ కేసు నమోదు చేయవచ్చు. ఇలాంటి కేసుల్లో మహిళలు తమకు చట్టపరంగా ఉన్న అవకాశాలను వినియోగించుకునేందుకు పోలీసులను ఆశ్రయించవచ్చు. కేసు తీవ్రతను బట్టి చర్యలు ఉంటాయి. – స్వాతి లక్రా, ఐజీపీ (లా అండ్ ఆర్డర్) విమెన్ సేప్టీ -
స్త్రీలోక సంచారం
పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లాక భార్యను వదిలించుకుని, ముఖం చాటేసి తిరుగుతున్నారన్న ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవలి కొద్ది నెలల్లోనే 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసి, వారిపై ‘లుకౌట్ సర్క్యులర్’ జారీ చేసినట్లు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది. భార్యకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటుకూ దొరక్కుండా తిరిగే ఇటువంటి భర్తలను వలపన్ని పట్టేందుకు జారీ అయ్యే లుకౌట్ నోటీసు వల్ల నిందితులు దేశాలు దాటేందుకు అవకాశం ఉండదు. ఎక్కడిక్కడ తనిఖీ చేస్తారు కనుక, ఎక్కడివారు అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరోవైపు.. తప్పుడు ఎన్నారై భర్తల ఆగడాలను నియంత్రించేందుకు జాతీయ మహిళా కమిషన్ ఈ ఏడాది జనవరిలో చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఇంతవరకు 578 మంది మహిళలు ముందుకొచ్చి తమ భర్త పెడుతున్న గృహహింసపైన, ఇతర దుశ్చర్యల మీద కమిషన్‌కు ఫిర్యాదు చేయగలిగారు. దీర్ఘకాలిక వ్యాధులకు నిత్యం మందులు వాడుతుండే మహిళల్లో ఔషధ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు పంజాబ్ ఆరోగ్యశాఖ ‘హార్మ్ రిడక్షన్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మొదట పంజాబ్‌లోని కపుర్తల జిల్లాలో అమలు చేయబోతున్నారు. ‘హార్మ్ రిడక్షన్ అడ్వొకసీ ఇన్ ఏషియా’, ‘గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్ అండ్ మలేరియా’ సంస్థల భాగస్వామ్యంతో పంజాబ్ ఆరోగ్య శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. మందుల దుష్ఫ్రభావాలను తగ్గించడానికి మార్గాలను అన్వేషించడమే కాకుండా, మందుల వాడకం వల్ల సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వెదికేందుకు పెట్టుబడులు రాబట్టి, పరిశోధనలు, అధ్యయనాలు చేయించడం; వాటి ఫలితాలను అనుసరించి మందులు వాడే మహిళలకు సూచనలు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ‘ఇండియా హె.ఐ.వి./ఎయిడ్స్’ సంస్థ డైరెక్టర్ (పాలసీ) డాక్టర్ ఉమంగ్ చావ్లా తెలిపారు. -
ఆన్లైన్లోనే ఎన్ఆర్ఐ భర్తలకు నోటీసులు
న్యూఢిల్లీ: భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్ఆర్ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. పోర్టల్ ఏర్పాటుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. పోర్టల్‌లో పొందుపరచిన వారెంట్లను నిందితుడికి జారీచేసినట్లుగానే భావించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్‌పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు. -
ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్..
సాక్షి, న్యూఢిల్లీ : కుటుంబ వివాదాల్లో చిక్కుకుని కోర్టు సమన్లను ఖాతరు చేయకుండా తప్పించుకు తిరిగే ఎన్ఆర్ఐ భర్తలకు సర్కార్ షాక్ ఇవ్వనుంది. కోర్టు సమన్లను లెక్కచేయని ఎన్ఆర్ఐ భర్తల ఉమ్మడి ఆస్తిలో వాటాను సీజ్ చేస్తూ చట్ట సవరణలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. విలాసవంతమైన జీవనశైలితో ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత భార్యలను వదిలివేస్తున్న ఎన్ఆర్ఐ భర్తల ఉదంతాలు పెరుగుతున్న క్రమంలో వీరికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది. జీవిత భాగస్వామి దాఖలు చేసిన ఫిర్యాదుపై పోలీసుల విచారకు, సమన్లకు స్పందించకుండా దేశ విదేశాల్లో తిరుగుతూ, గుర్తింపును సైతం మార్చుకుంటూ న్యాయప్రక్రియను ఎదుర్కోని వారి పేర్లను వెబ్సైట్లోపొందుపరచాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భావిస్తోంది. వారిని పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో పాటు వారి ఆస్తుల స్వాధీనం, పాస్‌పోర్టుల రద్దు వంటి తీవ్ర చర్యలూ చేపట్టాలని యోచిస్తోంది. మరోవైపు ఇటీవల ప్రకటించిన వివాహమైన 48 గంటల్లోగా ఎన్ఆర్ఐ వివాహాలను విధిగా రిజిస్టర్ చేయించాలన్న నిబంధనను సత్వర అమలుకు ప్రభుత్వం పూనుకుంది. భార్యలను మోసం చేసి తప్పించుకుతిరిగే ఎన్ఆర్ఐలను చట్టం ముందు దోషిగా నిలిపేందుకు చట్ట సవరణలను సత్వరమే చేపట్టాలని సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, మనేకా గాంధీ వంటి సీనియర్ మంత్రులతో కూడిన మంత్రుల బృందం నిర్ణయించింది. -
ఎన్నారై భర్తలపై కొరడా
విదేశాల్లో ఉద్యోగం.. లక్షల్లో జీతం... అక్కడ సొంత ఇల్లు, సొంత కారు–ఇలాంటి ఆకర్షణీయమైన కబుర్లు చెప్పి పెళ్లాడి, తీరా వెళ్లాక భార్యను శారీరకంగా, మాన సికంగా కష్టపెడుతున్న ప్రవాస భారతీయ (ఎన్నారై) యువకుల భరతం పట్టేందుకు భారతీయ శిక్షాస్మృతి(సీఆర్పీసీ)లో అవసరమైన నిబంధనలు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగింది. పెళ్లి చేసుకుని దేశంగాని దేశానికి కొత్తగా వెళ్లిన యువతులు అనుభవిస్తున్న కష్టాల గురించి దశాబ్దాలుగా మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతక్రితం కలిగిన కుటుంబాలకే ఇలాంటి సమస్యలుండేవి. కానీ 90వ దశకం తర్వాత విదేశాల్లో లక్షలమందికి సాఫ్ట్వేర్ రంగ నిపుణులుగా ఉద్యోగావకాశాలు లభించడం పర్యవసానంగా మధ్య తరగతి ప్రజానీకాన్ని కూడా ఆ సమస్యలు తాకాయి. విదేశీ సంబంధమని మోజు పడి పెళ్లి చేసి పంపితే అక్కడ బాధల్లో కూరుకుపోతున్న కుమార్తెల విషయంలో ఏం చేయాలో తోచక వేలాదిమంది తల్లిదండ్రులు కుమిలిపోతున్నారు. యువతుల్ని చిత్రహింసలపాలు చేయడం అర్ధాంతరంగా వెళ్లగొట్టడం రివాజైంది. మరికొందరు ఘనులు పెళ్లాడి ముచ్చట్లన్నీ తీర్చుకుని, కట్న కానుకలతో విదేశాలకు పోయి అక్కడినుంచి విడాకుల నోటీసులు పంపుతున్నారు. ఎన్నారైలకు ప్రాతినిధ్య ఓటింగ్ హక్కు కల్పించడానికి చాన్నాళ్లనుంచి మన ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ ఇలాంటి మహిళల ఇబ్బందులపై ఈ స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. తాజా నిర్ణయంతో ఆ లోటు సరిదిద్దినట్టవుతుంది. మన విదేశాంగశాఖ వెల్లడించిన గణాంకాలు విస్మయం కలిగిస్తాయి. 2015 జనవరి మొదలుకొని నిరుడు నవంబర్ వరకూ ఆ శాఖకు 3,328 ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా ప్రతి 8 గంటలకూ ఒక ఫిర్యాదు వస్తున్నదని ఆ శాఖ వివరించింది. అంటే రోజుకు మూడు ఫిర్యాదులందుతున్నాయన్నమాట. అయితే బాధిత మహిళల అసలు సంఖ్య ఇంతకు ఎన్నో రెట్లు ఎక్కువుంటుంది. అన్ని దారులూ మూసుకుపోయాకే ఏ యువతి అయినా ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తుంది. నిందితుల్లో 60 శాతం మంది యువకులని ఆ గణాంకాలు చెబుతున్నాయి. వివిధ రంగాల్లో ఎంతగా పురోగతి సాధించామనుకుంటున్నా మన దేశంలో మహిళలపై వేర్వేరు రూపాల్లో వివక్ష, అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. విదేశాలకు పోయే యువకులు తమతోపాటు ఈ కశ్మలాన్నంతటినీ మోసుకు పోతున్నారు. కుటుంబాల్లో యధావిధిగా తమ ఆధిపత్య ధోరణులను ప్రదర్శి స్తున్నారు. ఇక్కడిలాగే మన సంప్రదాయాలు, కట్టుబాట్లు ఆ దేశాల్లో సైతం మన మహిళలకు అవరోధంగా మారుతున్నాయి. వీటిని ధిక్కరించి ఫిర్యాదు చేద్దామనుకున్నా ఎక్కడికెళ్లాలో, ఎలా వెళ్లాలో, ఎవరితో మాట్లాడాలో, ఏం మాట్లాడాలో తెలియని అయోమయ స్థితి. కొత్తగా కాపురానికెళ్లినవారికి ఇవన్నీ పెను అవ రోధాలవుతున్నాయి. వీటిని అధిగమించి ఫిర్యాదు చేసినా అక్కడి పోలీస్ అధి కారులకు సమస్యేమిటో అవగాహన కావడం కష్టమవుతోంది. భర్తతో సమానంగా ఉద్యోగం చేసే మహిళ పరిస్థితి ఎంతో కొంత మెరుగు. ఆమె స్వతంత్రంగా జీవనం సాగిస్తూ సమస్యలపై పోరాడగలదు. కానీ హెచ్ 4 వీసాపై అమెరికాలో ఉంటున్న ఆడపిల్లలది దుర్భరస్థితి. వారు తప్పనిసరిగా భర్త సంపాదనపైనే ఆధారపడాలి. ఇక్కడ పెళ్లాడటం, అక్కడికెళ్లాక ఆ దేశాల్లోని విడాకుల చట్టం ప్రకారం వదుల్చు కోవడం ఈమధ్యకాలంలో బాగా పెరిగింది. అక్కడేం చేసినా అడిగే దిక్కుండదు... అత్తింటివారికి తెలియకుండా భారత్ వచ్చి దర్జాగా తిరిగి వెళ్లొచ్చునన్న భరోసా ఎన్నారై యువకుల్లో ఉంటున్నది. సీఆర్పీసీలో మార్పులు తీసుకురావాలన్న తాజా నిర్ణయం వల్ల ఇకపై ఇది అసాధ్యమవుతుంది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం భార్యలను విడిచిపెట్టిన కేసుల్లో న్యాయస్థానాలు జారీ చేసే సమన్లను వరసగా మూడుసార్లు బేఖాతరు చేసి నట్టయితే అలాంటివారిని ‘పరారీలో ఉన్న వ్యక్తులు’గా పరిగణించి వారి ఆస్తుల్ని, వారి తల్లిదండ్రుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు న్యాయస్థానాలు ఆదే శాలివ్వొచ్చు. దీంతోపాటు విదేశాంగ శాఖ వెబ్సైట్లో పెట్టే సమన్లకు చట్టబద్ధత కల్పించడానికి అనువుగా సీఆర్పీసీ నిబంధనలను సవరించాలని కేంద్ర హోం శాఖను విదేశాంగ శాఖ కోరింది. ఇది కూడా ఆహ్వానించదగ్గ మార్పు. సమన్లు తీసుకోవడానికి నిరాకరించినవారి ఇంటి తలుపుపైనో, గోడపైనో ఆ సమన్లను అతికిస్తే చట్టం దృష్టిలో ఆ సమన్లు వారికి అందినట్టే. ఇప్పుడు వెబ్సైట్లో ఉంచే నోటీసులకు కూడా ఇదే సూత్రం వర్తింపజేయడం మంచి ఆలోచన. అలా మూడుసార్లు వెబ్సైట్లో పెట్టాక నిందితుల ఆస్తుల స్వాధీనం ప్రక్రియ మొదలవుతుంది. చూడటానికిది మొత్తంగా ‘ఎన్నారై వధువుల’ సమస్యేగానీ ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. కేవలం భార్య ద్వారా సంక్రమించే ఆస్తిపై కన్నేసి కొందరు, ఇంట్లో ఉండే వృద్ధ తల్లిదండ్రుల అవసరాలు చూసుకోవడానికి ఇంకొందరు, జీతం ఇవ్వనవసరం లేని పనిమనిషిగా భావించి మరికొందరు యువతుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. పంజాబ్ నుంచి అయ్యే పెళ్లిళ్లలో 80 శాతం ఈ బాపతేనని గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, తెలం గాణ, గుజరాత్ రాష్ట్రాలున్నాయి. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయడం, గృహ హింసకు పాల్పడేవారిని, భార్యల్ని విడిచిపెట్టేవారిని అప్పగించేందుకు విదేశాలతో నేరస్తుల అప్పగింత ఒప్పందాలు కుదుర్చుకోవడం, ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించడానికి జాతీయ స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటుచేయడం, అందుకొక ప్రత్యేక వెబ్సైట్ పెట్టడం వంటి చర్యలు కూడా చాలా అవసరం. సంబంధం కుదుర్చుకోవడానికి ముందు అవతలి వ్యక్తి ఇచ్చిన సమాచారంలోని నిజా నిజాలేమిటో నిర్ధారించుకోవడం అవసరమన్న చైతన్యం అమ్మాయిల తల్లిదండ్రుల్లో కలగజేయడం అన్నిటికన్నా ముఖ్యం. ఇవన్నీ సాకారమైనప్పుడే పెళ్లి చేసి పంపిన మన ఆడపిల్లలు విదేశాల్లో క్షేమంగా, హుందాగా, గౌరవప్రదంగా బతక గలుగుతారు. -
భార్యను విడిచిపెడితే, మీ ఆస్తులు గోవిందా
న్యూఢిల్లీ : తమ కుమార్తెలకు విదేశీ సంబంధాల కోసం తల్లితండ్రులు ఉబలాటపడుతుంటే, ఎన్ఆర్ఐ పెళ్ళిళ్లు అమ్మాయిలకు కన్నీళ్లు మిగుల్చుతున్న ఉదంతాలు పెరిగిపోతున్నాయి. భారత్‌లో పెళ్లి చేసుకుని, కట్నం కానుకలు తీసుకుని భార్యలను విదేశాలకు తీసుకెళ్తున్న భర్తలు, వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వదిలి వేయడం, శారీరక వేధింపులకు గురిచేయడం..వంటి పలు కారణాలతో ఆడపిల్లలను వేధిస్తున్నారు. ఈ వేధింపులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. భార్యను వేధించినా.. వదిలేసినా భారత్‌లో భర్త లేదా వారి కుటుంబసభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని అంతర్ మంత్రిత్వ కమిటీ ప్రతిపాదించింది. ఈ విషయాన్ని స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ ధృవీకరించింది. వదిలివేయబడ్డ మహిళలకు చట్టపరమైన పరిష్కారంగా, జస్టిస్ కోసం భర్త, వారి కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఇటీవల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల్లో 2015 జనవరి 1 నుంచి 2017 నవంబర్ 30 మధ్యలో ఈ తరహా ఫిర్యాదులు 3,328 వరకూ అందాయని తెలిసింది. ఎన్ఆర్ఐ భర్తలు, భార్యలను వదిలివేయడం, వేధించడం, కట్నం డిమాండ్లు, శారీరక వేధింపులు, పాస్‌పోర్ట్ సీజ్ వంటి చేష్టలకు పాల్పడుతున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటి నుంచి అన్ని పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లను స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌కు లింక్ చేయనున్నామని, ఈ నెల చివరి వరకు ఈ ప్రక్రియను ముగించనున్నట్టు కేంద్ర మంత్రి మేనకా గాంధీ చెప్పారు. ఈ నిర్ణయం తీసుకున్న వారిలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, న్యాయమంత్రి రవి శంకర్ ప్రసాద్‌లు కూడా ఉన్నారు. డబ్ల్యూసీడీ కింద ఒక ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని నియమించాలని, ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను అది విచారించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ తరహా కేసుల్లో ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్టులు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తప్సనిసరి అన్ని రాష్ట్రాలు అన్ని పెళ్లిళ్లను రిజిస్ట్రేషన్లు చేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టడం లేదు. -
ఎన్ఆర్ఐ భర్తల బాధితులకు అండ!
న్యూఢిల్లీ: ఎన్ఆర్ఐ భర్తలు వదిలేసిన మహిళలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం త్వరలో వెబ్ పోర్టల్‌ను ప్రారంభించనుంది. ఇందులో లాయర్లు, ఈ రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు తదితరాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. గత వారం జరిగిన ప్రత్యేక కమిటీ సమావేశంలో వెబ్‌పోర్టల్‌ను తీసుకురావాలని నిర్ణయించారు. కమిటీలో మహిళా, శిశు సంక్షేమ శాఖ, విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కరేసి చొప్పున అధికారులున్నారు. విదేశాల్లో భర్త వదిలేసినా, స్వదేశంలో విడాకులు పొందడానికి సమస్యలు ఎదుర్కొంటున్న, మనోవర్తి పొందగోరే మహిళలకు ఈ పోర్టల్ సహాయకారిగా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాంటి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతేడాది ఏర్పడిన కమిటీ.. బాధితులకు అభివృద్ధి చెందిన దేశాల్లో 3 వేల డాలర్లు, వర్థమాన దేశాల్లో 2 వేల డాలర్లు ఆర్థిక సాయం చేయాలని ఇంతకు ముందే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత పోర్టల్‌ను విదేశాంగ శాఖ నిర్వహిస్తుంది.