న్యూఢిల్లీ: భార్యలను వేధిస్తున్న, పరారీలో ఉన్న ఎన్‌ఆర్‌ఐ భర్తలకు సమన్లు జారీచేసేందుకు పోర్టల్‌ను రూపొందిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఒకవేళ నిందితుడు స్పందించకుంటే, అతడిని ప్రకటిత నేరస్థుడిగా నిర్ధారించి, అతడి ఆస్తులను అటాచ్ చేస్తామని తెలిపారు. పోర్టల్ ఏర్పాటుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్‌పీసీ)లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు.
పోర్టల్‌లో పొందుపరచిన వారెంట్లను నిందితుడికి జారీచేసినట్లుగానే భావించాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధీనంలో ఏర్పాటైన అంతర మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సుల మేరకు 8 మంది నిందితులకు సమన్లు జారీచేసి, వారి పాస్‌పోర్టులు రద్దుచేశామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment