
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఎస్ జైశంకర్ త్వరలోనే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు. ప్రధాని మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ నుంచి జైశంకర్‌ను ఎగువ సభకు పంపిస్తారని బీజేపీ వర్గాల సమాచారం. మరో రెండు నెలల్లో దేశ వ్యాప్తంగా పది రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. గుజరాత్ 2, రాజస్తాన్ 2, తమిళనాడు 5, అస్సాంలో 1 స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో వాటిని ఎన్నిక అనివార‍్యం కానుంది. దీంతో లోక్‌సభకు ఎన్నిక కాకుండా కేంద్రమంత్రి పదవులు చేపట్టిన జైశంకర్, రాం విలాస్ పాశ్వాన్‌లను రాజ్యసభకు పంపనున్నారు.
అలాగే కేంద్రహోంమంత్రి అమిత్ షా, స్మృతి ఇరానీ, రవిశంకర్ ప్రసాద్‌లు లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో వారు ప్రస్తుతం ప్రాతినిథ్యం వహిస్తున్న రాజ్యసభకు రాజీనామా చేయనున్నారు. వీటిలో మెజార్టీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ సీనియర్ నేతలైన సుష్మా స్వరాజ్, ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్ జోషీలను కూడా పెద్దల సభకు పంపుతారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment