
రాజ్యసభకు అమిత్ షా నామినేషన్ దాఖలు
గాంధీనగర్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆగస్టు 8న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్ నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ప్రస్తుతం అమిత్‌షా గుజరాత్ అసెంబ్లీలో సభ్యుడిగా ఉన్నారు.
అలాగే సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతి ఇరానీ,బల్వంత్ సిన్హా రాజ్‌పుత్ కూడా ఇవాళ నామినేషన్ వేశారు. గుజరాత్, బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన 9 మంది సభ్యుల పదవీకాలం ఆగస్టు 18తో ముగియనుంది. వీరిలో స్మృతీ ఇరానీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తదితరులున్నారు.