
ఢిల్లీ : లడక్‌లోని గాల్వన్ లోయ ప్రాంతంలో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో ఇప్పటివరకు కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, తాజాగా మరో నలుగురి జవాన్ల పరిస్థితి విషమంగా మారడంతో భారత్- చైనా సరిహద్దులో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా అంతకముందు రాజ్‌నాథ్ సింగ్ విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతోఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్యాంగ్యాంగ్ సొ, దెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ, గాల్వన్ లోయ ప్రాంతాల్లో భారత బలగాల సంఖ్యను భారీగా పెంచాలని భేటీలో నిర్ణయించినట్లు సమాచారం.(విషం చిమ్మిన చైనా..)
కాగా రాజ్‌నాథ్ మరోసారి విదేశాంగ మంత్రి జై శంకర్, త్రివిద దళాల అధిపతులతో పాటు హోం మంత్రితో జరగనున్న కీలక భేటీలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సరిహద్దులో జరిగిన ఘర్షణలో మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించడంతో పాటు తాజా పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గాల్వన్ లోయ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణపై మధ్యాహ్నం కీలక సమావేశం జరగనుంది. గాల్వన్ లోయ ప్రాంతంలో తలెత్తిన ఘర్షణతో పాటు వాస్తవాధీన రేఖ వెంబడి ప్రస్తుత పరిస్థితిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. మరోవైపు హోం మంత్రి అమిత్ షా కూడా ప్రధాని మోదీతో సమావేశమై చైనా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. (ఇప్పటి వరకు జరిగింది చాలు..)
(సరిహద్దు ఘర్షణ: నలుగురు సైనికుల పరిస్థితి ఆందోళనకరం)
Comments
Please login to add a commentAdd a comment