ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోని భారతీయ సిబ్బందికి టెహ్రాన్ కాస్త ఊరటనిచ్చింది. మన దేశ అధికారులు వారిని కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.
గత శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే.
ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు
చదవండి: ఇజ్రాయెల్ నౌకపై దాడి.. ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్ నేవీ
Comments
Please login to add a commentAdd a comment