సాక్షి, న్యూఢిల్లీ : లడఖ్ ప్రాంతంలో భారత్-చైనా సేనల ఘర్షణ నేపథ్యంలో అక్కడి పరిస్ధితిని వివరించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఆర్మీ చీఫ్ ఎంఎం నరవనే, సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌లు పాల్గొన్నారు. ప్రధానితో భేటీకి ముందు జైశంకర్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో ఆయనను కలుసుకుని సరిహద్దు వివాదంపై సంప్రదింపులు జరిపారు. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు డ్రాగన్ దూకుడు కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై వారు సుదీర్ఘంగా చర్చించారు.
మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ భౌగోళిక సమగ్రత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని బీజేపీ చీఫ్ జేడీ నడ్డా పేర్కొన్నారు. భారత్ ఇప్పుడు బలమైన రాజకీయ సంకల్పంతో ఉందని, ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు మన సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని అన్నారు. కాగా గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్, చైనా సేనల మధ్య జరిగిన ఘర్షణలో ఓ కల్నల్‌తో పాటు ఇద్దరు భారత జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment