నేడు హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల | Today Microsoft CEO Satya Nadella to visit T-Hub | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల

Published Mon, Dec 28 2015 6:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

నేడు హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల - Sakshi

నేడు హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం (డిసెంబర్ 28) హైదరాబాద్ వస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భాగ్యనగరంలో అడుగుపెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌కు రావడం ఇది రెండోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంకుబేటర్ ‘టి-హబ్’ను ఈ సందర్భంగా సత్య నాదెళ్ల సందర్శించనున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి ఒక గంటపాటు టి-హబ్‌లో గడపనున్నట్టు సమాచారం.

ఈ సందర్భంగా టీ-హబ్‌లోని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నేడు అల్పాహారం(బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నారు. పలు ప్రాజెక్టుల కోసం టెక్నాలజీ అమలుకు ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement