ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో నాదెళ్ల
న్యూఢిల్లీ: చాలా మంది భారతీయుల్లాగే సత్య నాదెళ్లకు క్రికెట్ అంటే ప్రేమే. కంప్యూటర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా వ్యహరిస్తున్న నాదెళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో మీరు ఊహించగలరా ? లెక్కలు, లేదా సైన్స్ అని ఊహిస్తే, మీరు పప్పులో కాలేసినట్లే. ఆయనకు ఇష్టమైన సబ్జెక్ట్.. చరిత్ర. ఇక కోడింగ్.. కవిత్వం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరితో పిచ్చాపాటిగా జరిపిన సంభాషణలో ఆసక్తికరమైన విషయాలను సత్య నాదెళ్ల వెల్లడించారు.
ఎక్కడ ఉన్నా, మదిలో అదే...!
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో ఎవర్ని ఎన్నుకుంటారని అనంత్ అడుగగా, అప్పట్లో సచిన్ టెండూల్కర్ అని, ఇప్పుడైతే విరాట్ కోహ్లి అని సత్య నాదెళ్ల బదులిచ్చారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్‌లో క్రికెట్ ఆట తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా, తన మదిలో క్రికెడ్ క్రీడ మెదులుతూనే ఉంటుందని వివరించారు. కోడింగ్ కవిత్వం లాంటిదేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment