ouster
-
బంగ్లాదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టలేదు: అమెరికా
వాషింగ్టన్: తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా చేసినట్లు చెబుతున్న ఆరోపణలను వైట్‌హౌజ్ తోసిపుచ్చింది. ఈ విషయమై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జీన్పియెర్రె సోమవారం(ఆగస్టు12) మీడియాతో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను పదవి నుంచి దించడంలో మా పాత్ర ఏమీ లేదు. ఈ విషయంలో అమెరికాపై వచ్చిన ఆరోపణలేవీ నిజం కావు. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి పరిణామాలను గమనిస్తుంటాం’అని పియెర్రె తెలిపారు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్‌ను అప్పగించనందుకే తనను పదవి నుంచి అమెరికా దించిందని షేక్‌హసీనా ఆరోపించినట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే తన తల్లి అలాంటి ఆరోపణలేవీ చేయలేదని షేక్‌హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ చెప్పడం గమనార్హం. -
మైక్రోసాఫ్ట్‌లోకి సామ్ ఆల్ట్‌మ్యాన్
వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్ ఆల్ట్‌మ్యాన్ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్ ఆల్ట్‌మ్యాన్ తాజాగా మైక్రోసాఫ్ట్‌లో చేరి పోయారు. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. ఆల్ట్‌మ్యాన్‌ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ సైతం ఓపెన్ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మ్యాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్‌చేశారు. -
స్పీకర్నే దించేసుకున్నారు!
వాషింగ్టన్: అమెరికాలో విపక్ష రిపబ్లికన్ పార్టీ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రతినిధుల సభ స్పీకర్ పదవి నుంచి రిపబ్లికన్ నేత కెవిన్ మెకార్తీని సొంత పారీ్టకి చెందిన సభ్యులే సాగనంపారు! అగ్రరాజ్య చరిత్రలో స్పీకర్ ఇలా ఉద్వాసనకు గురవడం ఇదే తొలిసారి. ఆయనపై రిపబ్లికన్ నేత మాట్ గేట్జ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పారీ్టకి చెందిన మరో ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు మద్దతివడం ద్వారా అధికార డెమొక్రటిక్ పారీ్టతో చేతులు కలిపారు. దాంతో మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన ఓటింగ్‌లో 216–210 ఓట్లతో మెకార్తీ ఓటమి చవిచూశారు. ఈ ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన 15 రౌండ్ల ఓటింగ్ అనంతరం మెకార్తీ స్పీకర్‌గా నెగ్గడం తెలిసిందే. పది నెలలు తిరక్కుండానే ఆయన ఇలా అవమానకరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడిక తదుపరి స్పీకర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కొంప ముంచిన షట్‌డౌన్ కెవిన్ పారీ్టలో అందరి నమ్మకమూ కోల్పోయారని గేట్జ్ ఆరోపించారు. సైద్ధాంతికంగా తనతో అన్ని విషయాల్లోనూ విభేదించే తమ పార్టీ సభ్యులు కూడా ఆయన్ను దించేసే విషయంలో కలసి రావడమే ఇందుకు రుజువని చెప్పారు. ఆర్థిక షట్‌డౌన్‌ను తాత్కాలికంగా నివారించే సాకుతో అధికార పారీ్టతో కెవిన్ చేతులు కలిపారన్నది గేట్జ్ వర్గం ఆరోపణ. ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్‌తో ఆయన చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించింది. స్పీకర్‌కు ఉద్వాసనను కనీవినీ ఎరగని ఘటనగా డెమొక్రటిక్ పార్టీ కాంగ్రెస్ సభ్యుడు, ఇండియన్ అమెరికన్ అమీ బెరా అభివరి్ణంచారు. రిపబ్లికన్ల మధ్య నెలకొన్న పరస్పర అపనమ్మకానికి ఇది తాజా నిదర్శనమన్నారు. రిపబ్లికన్ల ఇంటిపోరు వల్లే... గేట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ రిపబ్లికన్ సభ్యులకు నిజానికి కెవిన్ మీద ఆది నుంచీ వ్యతిరేకతే! జనవరిలో స్పీకర్‌గా ఆయన ఎన్నిక కావడాన్ని వారు చివరిదాకా వ్యతిరేకించారు. దాంతో తనను తొలగించాలని ఒక్క రిపబ్లికన్ సభ్యుడు కోరినా దానిపై ఓటింగ్‌కు అనుమతిస్తానని వారితో ఒప్పందం చేసుకుని మెకార్తీ స్పీకర్‌గా నెగ్గారు. చివరికి అదే ఒప్పందం కారణంగా పదవిని కోల్పోయారు! అయితే సొంత పారీ్టలోనే ఇప్పుడు కెవిన్ ఉద్వాసనను తీవ్రంగా తప్పుబడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. గేట్జ్ చర్య ద్రోహపూరితమని వారు ఆరోపిస్తున్నారు. వారిమీద కఠిన చర్యలకు డిమాండ్ చేస్తుండటంతో రిపబ్లికన్ పారీ్టలో సంక్షోభం కాస్తా రసకందాయంలో పడింది! ఇప్పుడేంటి? ► తదుపరి స్పీకర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ► అమెరికా కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్లకే మెజారిటీ దక్కడం తెలిసిందే. ► గత జనవరిలో జరిగిన ఓటింగ్‌లో గెట్జ్ సారథ్యంలోని రైట్ వింగ్ వ్యతిరేకులను బుజ్జగించి మెకార్తీ కనాకష్టంగా స్పీకర్ అయ్యారు. ► అక్టోబర్ 11న కొత్త స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. ► తాజా పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీకి మెకార్తీ ససేమిరా అంటున్నారు. ► రిపబ్లికన్లలో ఇంటి పోరు తీవ్రంగా సాగుతుండటంతో స్పీకర్ అభ్యరి్థపై ఏకాభిప్రాయం కష్టంగానే కనిపిస్తోంది. ► ప్రస్తుతానికి రిపబ్లికన్ నేతలు స్టీవ్ స్కలైస్ (లూసియానా), టామ్ ఎమ్మర్ (మిన్నెసోటా) పేర్లు వినిపిస్తున్నాయి. -
టాటాల రూ.17వేల కోట్ల సంపద ఆవిరి
సంచలనం రేపిన సైరస్ మిస్త్రీ ఉద్వాస వ్యవహారంతో టాటా గ్రూపులోని ఐదు లిస్టెడ్ కంపెనీలకు భారీ షాక్ తగిలింది. దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒక్కటైన టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సరైస్ మిస్త్రీని తొలగించిన ఈ రెండురోజుల కాలంలో మార్కెట్ విలువ పరంగా టాటా గ్రూప్ దాదాపు రూ.17 వేలకోట్ల రూపాయలను నష్టపోయింది. ఈ షాకింగ్ న్యూస్ తో రెండు ట్రేడింగ్ సెషన్లలో టాటా కంపెనీల షేర్లు దిగ్భ్రాంతికి గురి చేసిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిస్త్రీ తొలగింపు ఐటీ కంపెనీ భవిష్యత్తుపై మరింత ప్రభావాన్ని చూపించనుందని సిటీ గ్రూపు వ్యాఖ్యానించింది. ముఖ్యంగా టాటా గ్రూప్ కంపెనీలోని గరిష్ట మార్కెట్ క్యాప్ కలిగినఐటీ దిగ్గజం టిసిఎస్ షేర్ ఈ రెండు రోజుల్లో 1.6 శాతం నష్టపోయింది. మార్కెట్ విలువలో రూ.7.788 కోట్ల రూపాయలు కోల్పోయింది. టాటా మోటార్స్ (డీవీఆర్ షేర్లు సహా) రూ.6,100 కోట్ల సంపద ఆవిరైపోయింది. అలాగే ఇతర కంపెనీల కూడా ఇదే బాటలో పయనించాయి. టాటా స్టీల్ రూ.1,431 కోట్లు, టైటాన్ రూ.906 కోట్లు, టాటా పవర్ రూ.607కోట్ల భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి అయితే మధ్యంతర బాధ్యతలను స్వీకరించిన రతన్ టాటా ఈ పరిణామాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం టాప్ సీఈవోల సమావేశంలో హామీ ఇచ్చారు. దీనికి బదులుగా వ్యాపారంపై తద్వారా సంస్థను మార్కెట్ లీడర్స్ గా నిలపడం పై దృష్టిపెట్టాలని కోరిన సంగతి తెలిసిందే. -
సైరస్ మిస్త్రీ తొలగింపుపై విమర్శలు
టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలకడం చట్టవిరుద్ధమని టాటా గ్రూప్‌లోని మెజార్టీ స్టాక్హోల్డర్స్ షాపూర్జీ, పల్లోంజి గ్రూప్ విమర్శిస్తోంది. మిస్త్రీని తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందని కాదని పేర్కొంటోంది. ఈ విషయాన్ని సీనియర్ లాయర్ మోహన్ పరశారణ్ నిర్థారించారు.మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులో ఎనిమిది మంది ఈ నిర్ణయం తీసుకోవడంలో ఓటింగ్‌లో పాల్గొన్నారని పల్లోంజి గ్రూప్ తెలిపింది. వారిలో ఆరుగురు మిస్త్రీ ఉద్వాసనకు మద్దతు పలుకగా, మిగిలిన ఇద్దరు వ్యతిరేకించారని వెల్లడించింది. సైరస్ మిస్త్రీని తప్పించే నిర్ణయం ఏకగ్రీవంగా జరిగిందనే టాటా సన్స్ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశీయ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలో ఒకటైన టాటా సన్స్ సైరస్ మిస్త్రీని విధుల నుంచి తప్పిస్తూ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటాను నియమించింది. పూర్తిస్థాయి చైర్మన్‌ను నాలుగు నెలల్లో సెలక్షన్ కమిటీ నియమించనుంది. ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్రా, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్య ఉన్నారు. మిస్త్రీ తొలగింపుపై ఎలాంటి కారణాలను టాటా సన్స్ వెల్లడించలేదు. కానీ లాభాపేక్ష లేని కంపెనీలను తొలగిస్తూ మిస్త్రీ తీసుకుంటున్న చర్యలతో టాటా సన్స్ అసంతృప్తిగా ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను తొలగించిన్నట్టు సమాచారం.