శాన్ ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ తయారీసంస్థ ఓపెన్‌ఏఐ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్‌ఏఐ తాజాగా ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్‌వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్‌ఏఐ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే కొత్తగా బ్రెట్ టైలర్ నేతృత్వంలో నూతన బోర్డును ఏర్పాటుచేస్తున్నట్లు సంస్థ తెలిపింది.
ఇటీవల బహిష్కరణ తర్వాత సామ్‌ను మైక్రోసాఫ్ట్‌కు చెందిన నూతన అడ్వాన్స్‌డ్ ఏఐ పరిశోధనా బృందంలో చేర్చుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ సారథి సత్య నాదెళ్ల ప్రకటించడం తెల్సిందే. సామ్‌ను మళ్లీ సంస్థలోకి తీసుకోవాలని వాటాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అతని షరతులకు సంస్థ ఒప్పుకోకతప్పలేదని తెలుస్తోంది. సంస్థలోకి పునరాగమనాన్ని సామ్ ధ్రువీకరించారు. మళ్లీ కృత్రిమ మేధ విభాగంలో అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment