కృత్తిమ మేధ (Artificial Intelligence) చాట్‌జీపీటీ మాతృసంస్ధ ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. భారత్‌తో పాటు ఇజ్రాయిల్, జోర్డాన్, ఖతార్, యూఏఈ, సౌత్ కొరియాలలో సైతం పర్యటించన్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇందుగలడందులేడని సందేహము వలదన్న మాట కృత్రిమమేధకి సరిగ్గా సరిపోతుంది. చాట్‌జీపీటీ విడుదలతో విద్య నుంచి వైద్యం వరకూ, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ప్రపంచ దేశాల్లోని పలు సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ముడిపడుతున్నాయి. ఈ తరుణంలో ఆల్ట్‌మన్ భారత పర్యటన చర్చాంశనీయంగా మారింది.
excited to visit israel, jordan, qatar, the uae, india, and south korea this week!
— Sam Altman (@sama) June 4, 2023
ఓపెన్‌ఏఐ సీఈవో భారత్‌కు ఎందుకు వస్తున్నారు?
ఏఐ విభాగంలో పరిశోధన - అభివృద్ధిలో భారత్ ప్రపంచంలోని సాంకేతికంగా ముందజలో ఉన్న దేశాలతో పోటీపడుతుంది. ప్రస్తుతం వేగంగా వృద్ది చెందుతున్న కృత్తిమ మేధపై పట్టుసాధిస్తూ ఏఐ గ్లోబల్ హబ్‌గా భారత్‌ను తీర్చిదిద్దాలని ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఏఐ వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా విధి - విధానాల రూపకల్పనలో భాగం కావాలని ఆహ్వానించినట్లు కేంద్రం ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆల్ట్‌మన్ భారత్‌లో పర్యటించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి👉 'AI'తో 30కోట్ల ఉద్యోగాలు ఉఫ్!.. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment