కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత చాట్ బాట్ చాట్‌జీపీటీకి భారీ షాక్ తగిలింది. 40 ఏళ్ల టెక్నాలజీ చరిత్ర (బిల్‌గేట్స్ అభిప్రాయం మేరకు)లో సరికొత్త సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన చాట్‌జీపీటీ వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపి వేస్తూ ఓ దేశం అధికారికంగా ప్రకటించింది.
టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అద్భుతమే. కానీ ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగంతో మనుషులకు ఉపాధి లేకుండా పోతుందని, యంత్రాలే ఉద్యోగాలు చేస్తాయేమోనన్న భయాలు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నాయి. ఆ భయాల్ని నిజం చేసేలా ‘టెక్నాలజీ కంటే మానవుడు ఎల్లప్పుడూ ముందంజ’లో ఉంటాడని నమ్మే చాట్‌జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మాన్ సైతం ఈ లేటెస్ట్ టెక్నాలజీ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చదవండి👉 చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ సంచలన వ్యాఖ్యలు
ఈ తరుణంలో చాట్‌జీపీటీ వినియోగాన్ని తాత్కాలికంగా బ్యాన్ చేస్తున్నట్లు ఇటలీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. న్యూయార్క్‌టైమ్స్ ప్రకారం.. ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఓపెన్ ఏఐకి చెందిన చాట్‌జీపీటీ యూజర్ల సమాచారాన్ని దొంగిలించినట్లు ఆరోపిస్తుంది. అంతేకాదు మైనర్‌లు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా నిరోధించే వ్యవస్థ చాట్ జీపీటీలో లేదని ఇటాలియన్ అథారిటీ తెలిపింది.
We of course defer to the Italian government and have ceased offering ChatGPT in Italy (though we think we are following all privacy laws).
— Sam Altman (@sama) March 31, 2023
Italy is one of my favorite countries and I look forward to visiting again soon!
భద్రత దృష్ట్యా ప్రపంచ దేశాల్లో చాట్‌జీపీటీని ఇటలీ తొలిసారిగా బ్యాన్ చేసింది. ఇక చైనా, రష్యా, నార్త్ కొరియా, ఇరాన్ దేశాలు సైతం చాట్‌జీపీటీ వినియోగించకుండా కఠిన చట్టాలు అమలు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. నిషేధంపై చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. ఇటలీ తనకు ఇష్టమైన దేశాలలో ఒకటి’ అని అంటూనే ఇటలీలో చాట్‌జీపీటీ సేవల్ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కానీ చాట్‌జీపీటీ విషయంలో అన్ని గోప్యతా చట్టాలను అనుసరిస్తున్నామని భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
చదవండి👉 మరోసారి బాంబు పేల్చిన చాట్‌జీపీటీ సృష్టికర్త ఆల్ట్‌మాన్
Comments
Please login to add a commentAdd a comment