
ఓవైపు సినిమాలు చేస్తూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో షూటింగ్‌కు ముందే భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులు ఆభయ్, భార్గవ్ రామ్‍లతో కలసి వెకేషన్‌కు వెళ్లారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వాళ్లు దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా తారక్ చిన్న కోడుకు భార్గవ్ రామ్ భలే క్యూట్‌గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వెకేషన్ ట్రిప్ చాలా చిన్నదని, మళ్లీ వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ హైదరబాద్‌కు చేరుకుంటారని, ఆ వెంటనే కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తుంది.
NTR with his family off to Vacation
— NTR THE LEGEND (@NTRTHELEGEND) May 28, 2023
Bhargav Ram 😍😍
PC @ArtistryBuzz@tarak9999 #Devara #ManOfMassesNTR pic.twitter.com/iSJiOBK36g