భార‍్యకు ప్రేమతో టాలీవుడ్ హీరో.. | Manchu Manoj Birthday wishes to his wife | Sakshi
Sakshi News home page

భార‍్యకు ప్రేమతో టాలీవుడ్ హీరో..

Published Thu, Jul 20 2017 10:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:29 PM

భార‍్యకు ప్రేమతో టాలీవుడ్ హీరో..

భార‍్యకు ప్రేమతో టాలీవుడ్ హీరో..

హైదరాబాద్: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆయన భార్యకు ప్రేమతో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు (జూలై 20న) తన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మనోజ్. భార్య పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా తీసిన ఓ ఫొటోను తన ఫాలోయర్స్, అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

అయితే మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ నా మనసును దోచుకున్న మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చివరిక్షణం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఆ తర్వాత కూడా నీపై ప్రేమ అలాగే ఉండిపోతుందంటూ’  మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మనోజ్ అభిమానులు, ఫాలోయర్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. ప్రణతికి బర్త్ డే విషెస్ తెలిపారు. వీరి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోవాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement