తనే నా దేవత! | Manchu Manoj Responds on about Divorce Rumours | Sakshi
Sakshi News home page

తనే నా దేవత!

Published Sun, Jun 10 2018 1:35 AM | Last Updated on Fri, Sep 28 2018 4:32 PM

Manchu Manoj Responds on about Divorce Rumours - Sakshi

మంచు మనోజ్‌, ప్రణతి

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్‌లో మంచి స్థానం సంపాదించుకున్నారు హీరో మంచు మనోజ్‌. మూడేళ్ల కిత్రం ప్రణతి మెడలో మూడు ముళ్లు వేసి వివాహం చేసుకున్నారు మనోజ్‌. కానీ సడన్‌గా ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారన్న పుకార్లు వచ్చాయి. వీటిపై మనోజ్‌ ట్వీటర్‌లో చేసిన చాట్‌లో భాగంగా స్పందించారు.

ఆ పుకార్లను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. ‘‘ 2010లో తను నా జీవితంలోకి అడుగు పెట్టింది. నా గుండె ఆగిపోయేంత వరకు తనే నా దేవత’ అని ఓ అభిమాని ప్రశ్నకు బదులిచ్చారు మనోజ్‌. అలాగే.. ‘‘మీ సినిమాల్లోనుంచి ఏయే సాంగ్స్‌ను వదినకు డెడికేట్‌ చేస్తారు’’ అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్‌ బదులిస్తూ– ‘‘పోటుగాడు’చిత్రంలోని ‘దేవత’, ‘కరెంట్‌ తీగ’ సినిమాలోని ‘పిల్లా ఓ పిల్లా’ సాంగ్స్‌ను ఆమె కోసమే స్పెషల్‌గా చేశాను’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement