
రామ్‌చరణ్, ఎన్టీఆర్, చరణ్ ఫ్యామిలీలు
బ్యాంకాక్ వెళ్లడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు హీరో రామ్‌చరణ్. సమ్మర్ కదా ఫ్యామిలీ ట్రిప్ అనుకునేరు... కానే కాదు. షూటింగ్ కోసమే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరగనుంది. అంటే రామ్‌చరణ్ అండ్ టీమ్ బ్యాంకాక్ వెళతారన్న మాట. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన మేజర్ షెడ్యూల్‌లో ఫ్యామిలీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అంతకముందు షెడ్యూల్‌లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌పై సన్నివేశాలను షూట్ చేశాం. ఈ నెల 12న బ్యాంకాక్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ 15 రోజులపాటు జరగనుంది’’ అన్నారు. ప్రశాంత్, స్నేహ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్.
శనివారం ఎన్టీఆర్, ప్రణతి దంపతుల మ్యారేజ్ యానీవర్శరీ. ఈ వేడకకు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన వెళ్లారు. ‘‘తారక్ (ఎన్టీఆర్), ప్రణతిలకు హ్యాపీ యానీవర్శరీ. తారక్, ప్రణతి, అభయ్ (ఎన్టీఆర్ తనయుడు) నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు’’ అని పేర్కొన్నారు ఉపాసన. అన్నట్లు ఇంకోమాట. వచ్చే యానీవర్శరీకి ఇంకో గెస్ట్ కూడా ఉంటారు. అదేనండీ.. ఎన్టీఆర్ సతీమణి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా. వచ్చే ఏడాది అభయ్‌కు తోడుగా తమ్ముడో, చెల్లెలో ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment