bankak
-
కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం..ఏ దేశాల్లో అమల్లో ఉందంటే..!
బ్యాంకాక్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగాలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. భారత్‌లో నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ లాభం లేకుండా పోతోంది. అలాంటి వారికి కఠిన శిక్షలు అమలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపిస్టులపై కొరడా ఝులిపించింది థాయ్‌లాండ్. అత్యాచారాలకు పాల్పడిన వారిని కఠినమైన కెమికల్ కాస్ట్రేషన్‌కు గురి చేసే చట్టానికి ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ప్రకారం.. సైకియాట్రిక్, అంతర్గత మెడిసన్ స్పెషలిస్ట్‌ల ఆమోదంతో పాటు నేరస్థుడి అనుమతితో కెమికల్ కాస్ట్రేషన్ చేపట్టాలి. లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేలా శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయులను తగ్గించే ఇంజెక్షన్లు, చికిత్సకు అంగీకరించిన వారి జైలు శిక్ష తగ్గించనున్నారని బ్యాంకాక్ పోస్ట్ తెలిపింది. 'హింస సంబంధిత పునర్విచారణ నిరోధక బిల్లు'ను న్యాయశాఖ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును దిగువ సభ గత ఫిబ్రవరిలోనే ఆమోదించగా.. తాజాగా ఎగువసభ సెనేట్ ఆమోద ముద్ర వేసింది. 147 సభ్యులతో కూడిన సభలో బిల్లుకు ఇద్దరు గైర్హాజరు కాగా 145-0 తేడాతే ఏకగ్రీవంగా ఆమోదం లభించటం గమనార్హం. స్వచ్ఛంద కెమికల్ కాస్ట్రేషన్ బిల్లుకు ఆమోదం లభించిన క్రమంలో.. చేపట్టాల్సిన ప్రక్రియను అధికారులు సిద్ధం చేయనున్నారు. ఈ బిల్లు రాయల్ గెజిట్‌లో పబ్లీష్ అయ్యాక చట్టంగా మారనుంది. ఏ దేశాలు ఈ శిక్షను అమలు చేస్తున్నాయి? కెమికల్ కాస్ట్రేషన్ అనేది శిక్షల్లో కొత్తదేమి కాదు. ఇది దక్షిణ కొరియా, పాకిస్థాన్, పోలాండ్, అమెరికాలోని ఎనిమిది రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. మరోవైపు.. నార్వే, డెన్మార్క్, జర్మనీ వంటి దేశాల్లో సర్జికల్ కాస్ట్రేషన్‌ను పాటిస్తున్నారు. అయితే.. ఈ విధమైన శిక్షలు మానవ హక్కులను హరిస్తున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాస్ట్రేషన్ చేయటం వల్ల నేరస్థుడు తన జీవితాంతం లైంగిక చర్యలో పాల్గొనలేడు. దీనికి గురైన వ్యక్తి క్రూరంగా ప్రవర్తించటం, వివాహద్వేషిగా మారతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళలు, బాలికలను ద్వేషించటం, వారికి హాని కలిగించటం వంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని తెలిపారు. సెక్స్ అనేది ఒక్కటే దాడికి మార్గం కాదని, ఇతర దారుల్లో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు.. అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న క్రమంలో ఇలాంటి కఠిన శిక్షలు అవసరమని మరోవర్గం వాదిస్తోంది. కాస్ట్రేషన్ భయంతో నేరాలకు పాల్పడేందుకు వెనకడుగువేస్తారని బావిస్తున్నారు. ఇదీ చూడండి: యూపీలో 'బై బై మోదీ' హోర్డింగ్.. అది టీఆర్ఎస్ మద్దతుదారుల పనేనా? -
బ్యాంకాక్ బంగ్లాలో
బ్యాంకాక్‌కి పయనం అయ్యారు రామ్‌చరణ్. ఇరవై రోజులు అక్కడే ఉంటారు. వెకేషనేమో అనుకుంటున్నారా? నో చాన్స్ అంటున్నారు రామ్‌చరణ్. ఈ హీరోగారు వెళ్లింది షూటింగ్ కోసం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్ కోసం టీమ్ అంతా బ్యాంకాక్ వెళ్లింది. సుమారు 120 మంది ఆర్టిస్టులతో అక్కడ భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు బోయపాటి. బ్యాంకాక్‌లోని పెద్ద బంగ్లాలో షూట్ చేయనున్నారట. ఈ సీన్స్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సెప్టెంబర్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: యస్.యస్. తమన్. -
చలో బ్యాంకాక్
బ్యాంకాక్ వెళ్లడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు హీరో రామ్‌చరణ్. సమ్మర్ కదా ఫ్యామిలీ ట్రిప్ అనుకునేరు... కానే కాదు. షూటింగ్ కోసమే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరగనుంది. అంటే రామ్‌చరణ్ అండ్ టీమ్ బ్యాంకాక్ వెళతారన్న మాట. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన మేజర్ షెడ్యూల్లో ఫ్యామిలీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అంతకముందు షెడ్యూల్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌పై సన్నివేశాలను షూట్ చేశాం. ఈ నెల 12న బ్యాంకాక్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ 15 రోజులపాటు జరగనుంది’’ అన్నారు. ప్రశాంత్, స్నేహ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. శనివారం ఎన్టీఆర్, ప్రణతి దంపతుల మ్యారేజ్ యానీవర్శరీ. ఈ వేడకకు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన వెళ్లారు. ‘‘తారక్ (ఎన్టీఆర్), ప్రణతిలకు హ్యాపీ యానీవర్శరీ. తారక్, ప్రణతి, అభయ్ (ఎన్టీఆర్ తనయుడు) నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు’’ అని పేర్కొన్నారు ఉపాసన. అన్నట్లు ఇంకోమాట. వచ్చే యానీవర్శరీకి ఇంకో గెస్ట్ కూడా ఉంటారు. అదేనండీ.. ఎన్టీఆర్ సతీమణి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా. వచ్చే ఏడాది అభయ్కు తోడుగా తమ్ముడో, చెల్లెలో ఉంటారు. -
మెటార్‌సైకిల్ బాంబు పేలి ముగ్గురు మృతి
బ్యాంకాక్: మోటార్ సైకిల్ బాంబు పేలి ముగ్గురు పౌరులు మృతిచెందారు. మరో 19మంది గాయపడ్డారు. థాయ్‌లాండ్‌కు దక్షిణాన ఉన్న తిరుగుబాటుదారుల ప్రాంతమైన యాలా పట్టణంలో సోమవారం ఉదయం ఈ సంఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు డౌన్‌టౌన్‌లోని పంది మాంసం అమ్మే ఓ దుకాణం ముందు మోటార్ సైకిల్‌ను పార్కు చేసి ఉంచారని, అందులోని బాంబులు పేలడంతో ముగ్గురు మృతిచెందారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలల కిందట ఇలాంటి సంఘటనే మొదటగా మెజారిటీ ముస్లింలు నివసించే ప్రాంతంలో జరిగింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. -
బ్యాంకాక్ లో భారీ పేలుడు
27 మంది మృతి 117 మందికి పైగా గాయాలు బ్రహ్మదేవుడి ఆలయ ప్రాంగణంలో ఘటన బ్యాంకాక్: పర్యాటక నగరమైన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ భీకర బాంబు పేలుడుతో దద్దరిల్లింది. నగరం నడిబొడ్డున, వాణిజ్య ప్రాంతంలోని సృష్టికర్త బ్రహ్మదేవుడి ఆలయం సాక్షిగా దుండగులు నెత్తుటేర్లు పారించారు. గుడి ఆవరణలోనే అత్యంత శక్తిమంతమైన బాంబును పేల్చి 27 మందిని బలి తీసుకున్నారు. పేలుడు ధాటికి అక్కడి కార్లు, బైకులు కూడా పేలిపోయాయి. 117 మందికిపైగా గాయపడ్డారు. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఆ ప్రాంతం చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు, క్షతగాత్రుల రోదనలు, తెగిపడిన శరీరాంగాలతో భీతావహంగా మారింది. పరిస్థితిని సమీక్షించేందుకు వార్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు దేశ ప్రధాని ప్రయుత్ చనోచా వెల్లడించారు. ఈ దాడికి ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత తీసుకోలేదు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 7 గంటలకు చిద్లోమ్ డిస్ట్రిక్ట్, రాజ్‌ప్రసంగ్ జంక్షన్‌లోని ‘ఎరవాన్ (బ్రహ్మదేవుడి) ఆలయం’ ప్రాంగణంలో ఉన్న ఒక స్తంభం వద్ద భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. క్షణాల వ్యవధిలో అక్కడున్న బైక్‌లు, కార్లు పేలిపోయాయి. చిన్న వాహనాలు ఎగిరి పడ్డాయి. ఆ పక్కనే మూడు పెద్ద షాపింగ్ మాల్స్, అంతర్జాతీయ స్థాయి హోటళ్లు ఉండటం, సాయంత్రం కావడంతో అక్కడంతా రద్దీగా ఉంది. దాంతో పేలుళ్ల బాధితుల సంఖ్య భారీగా పెరిగింది. మృతుల్లో ఇద్దరు చైనీయులు, ఒకరు ఫిలిప్పీన్స్ దేశీయుడు సహా నలుగురు విదేశీయులు ఉన్నారు. 16 మంది చనిపోయారని పోలీసులు చెప్పగా, 27 మంది చనిపోయినట్లు థాయ్ టీవీ తెలిపింది. ఈ ‘ఫ్రా ప్రొం(బ్రహ్మదేవుడు)’ గుడి బ్యాంకాక్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. రాజ్‌ప్రసంగ్ ఇటీవల రాజకీయ ప్రదర్శనలకు వేదికకైంది. పేలుడు ధాటికి గుడి చుట్టూ ఉన్న ఇనుపకంచె ముక్కలైంది. ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ‘అది టీఎన్టీ బాంబు. మా పర్యాటకరంగాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు బ్యాంకాక్ వచ్చిన విదేశీయులు లక్ష్యంగా బాంబు దాడులకు తెగబడ్డారు’ అని రక్షణ మంత్రి వాంగ్‌సువాంగ్ చెప్పారు. 5 కేజీల టీఎన్టీ బాంబును పేల్చారని, 40 అడుగుల విస్తీర్ణంలో దాని ప్రభావం పడిందని పోలీసులు చెప్పారు. అక్కడే ఉంచిన మరో రెండు బాంబుల్ని నిర్వీర్యం చేశారని మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ దౌత్యాధికారుల లక్ష్యంగా కొందరు ఇరాన్ దేశీయులు చేసిన దాడిగా దీన్ని భావిస్తున్నట్లు అధికారులు చెప్పారు. పలువురు ఇరాన్ దేశీయులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిలో ఒకరు పేలుళ్లలో గాయపడ్డారన్నారు. మృతుల్లో, క్షతగాత్రుల్లో భారతీయులున్నట్లు సమాచారం రాలేదని థాయ్‌లాండ్‌లో భారత రాయబారి హర్షవర్ధన్ తెలిపారు. థాయ్‌లో బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాదఘటనలు అరుదు. 2012 నాటి పేలుళ్లలో ఐదుగురు గాయపడ్డారు. మోదీ ఖండన.. ఈ పేలుళ్లపై భారత ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘వీటిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాల గురించే ఆలోచిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.