బ్యాంకాక్‌ బంగ్లాలో | Ram Charan shooting in Bangkok for upcoming Boyapati's film | Sakshi
Sakshi News home page

బ్యాంకాక్‌ బంగ్లాలో

Published Tue, May 15 2018 12:31 AM | Last Updated on Tue, May 15 2018 12:31 AM

Ram Charan shooting in Bangkok for upcoming Boyapati's film - Sakshi

బ్యాంకాక్‌కి పయనం అయ్యారు రామ్‌చరణ్‌. ఇరవై రోజులు అక్కడే ఉంటారు. వెకేషనేమో అనుకుంటున్నారా? నో చాన్స్‌ అంటున్నారు రామ్‌చరణ్‌. ఈ హీరోగారు వెళ్లింది షూటింగ్‌ కోసం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్‌ హీరోగా డీవీవీ దానయ్య  ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ కోసం టీమ్‌ అంతా బ్యాంకాక్‌ వెళ్లింది. సుమారు 120 మంది ఆర్టిస్టులతో అక్కడ భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు బోయపాటి. బ్యాంకాక్‌లోని పెద్ద బంగ్లాలో షూట్‌ చేయనున్నారట. ఈ సీన్స్‌లో సినిమాలోని కీలక పాత్రధారులందరూ పాల్గొననున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను సెప్టెంబర్‌లో రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: యస్‌.యస్‌. తమన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement