సెట్‌ చేస్తున్నారు | rrr movie next schedule on jan 21 | Sakshi
Sakshi News home page

సెట్‌ చేస్తున్నారు

Published Sun, Jan 13 2019 12:33 AM | Last Updated on Sun, Jul 14 2019 4:08 PM

rrr movie next schedule on jan 21 - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌

అంతా సెట్‌ చేస్తున్నారు. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను స్టార్ట్‌ చేయడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ అంతా సెట్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (వర్కింగ్‌ టైటిల్‌). ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ ఇటీవలే ముగిసింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ ఈ నెల 21న ప్రారంభం కానుంది. కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

అలాగే ఈ సినిమాలోని కథనాయికల పేర్లను ఈ నెలలోనే అనౌన్స్‌ చేయడానికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ రెడీ అవుతోందని సమాచారం. కీర్తీ సురేశ్, కియారా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఆ పేర్లనే చెబుతారా చూడాలి. పీరియాడికల్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు యం.యం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... భార్య ఉపాసనతో కలిసి రామ్‌చరణ్‌ ఓ పది రోజులు హాలిడేకి వెళ్లారట. అంటే ఈ ట్రిప్‌ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో రామ్‌చరణ్‌ జాయిన్‌ అవుతారని ఊహించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement