
రామ్‌చరణ్
రామ్‌చరణ్ డ్యాన్స్‌లో గ్రేస్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘వినయ విధేయ రామ’ కోసం మరోసారి విజిల్ కొట్టే స్టెప్స్‌ను అభిమానులకు చూపించడానికి రెడీ అవుతున్నారట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మాత.
ఈ సినిమా ప్రీ– రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఈ నెల 27న జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘ఆల్రెడీ విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం భారీ సెట్లో ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నాం. ప్రీ–రిలీజ్ ఈవెంట్‌ను భారీ లెవల్లో నిర్వహిస్తాం. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment