
రామ్ చరణ్
‘భయపెట్టడానికైతే పది నిమిషాలు, చంపేయడానికైతే పావుగంట. ఏదైనా ఓకే.. సెలెక్ట్ చేస్కో’ అంటూ పవర్‌ఫుల్ డైలాగ్స్ పలుకుతున్నారు రామ్ చరణ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా రూపొందుతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శుక్రవారం రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్ చూస్తుంటే బోయపాటి శ్రీను మార్క్ మాస్ అంశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో రామ్ కొణిదెల పేరుతో కనిపించనున్నారు చెర్రీ. ‘నువ్వు పందెం పరశురామ్ అయితే నేను రామ్ కొ.ణి.దె.ల’ అంటూ చరణ్ చెప్పిన ఈ డైలాగ్ టీజర్‌లో హైలైట్‌గా నిలిచింది. ఆర్యన్ రాజేశ్, ప్రశాంత్‌లు రామ్ చరణ్ అన్నయ్యలుగా కనిపించనున్నారు. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఓబెరాయ్ విలన్ పాత్ర చేశారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.
Comments
Please login to add a commentAdd a comment