
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. తారక్, ప్రణతీ దంపతులకు ఈ రోజు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తారక సోదరుడు హీరో కల్యాణ్ రామ్ ఎన్టీఆర్‌కు విషెస్ తెలియజేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ దంపతులకు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు.
ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు.
The family grows bigger. It’s a BOY!
— Jr NTR (@tarak9999) 14 June 2018
Comments
Please login to add a commentAdd a comment