కారంపొడి చల్లి.. గొలుసు చోరీ | Chain snacing in Banjara Hills | Sakshi
Sakshi News home page

కారంపొడి చల్లి.. గొలుసు చోరీ

Published Tue, Apr 12 2016 7:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Chain snacing in Banjara Hills

వాకింగ్ కోసం వెళ్తున్న మహిళ మెడపైన కారంపొడి చల్లిబంగారు గొలుసు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 71లో నివసించే ప్రసన్నలక్ష్మి(37) సోమవారం ఉదయం సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో వాకింగ్ చేసేందుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడపైన కారంపొడి చల్లి ఆమె అప్రమత్తమయ్యేలోగా మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు.

 

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ చౌరస్తాలో ఉన్నో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవలనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పోలీసులకు దర్యాప్తులో కీలక సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement