చీరాల రూరల్: మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి రైలుకిందపడి బలవన్మరణం చెందింది. ఈఘటన బుధవారం రాత్రి చీరాల–జాండ్రపేట రైల్వేస్టేషన్‌ల మధ్య జరిగింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (30)చీరాలలోని వైకుంఠపురం విఠల్‌నగర్ సచివాలయంలో శానిటేషన్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.
ఈమెకు గతంలోనే వివాహం జరగగా కుటుంబ కలహాల నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఈమె విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో మృతురాలు లక్ష్మీప్రసన్న, గోపి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి వివాహం విషయంలో కొంత కాలంగా ఆమె ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎరుకుల హక్కుల పోరాట సమితి ధర్నా..
మృతురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తండ్రి వారి బంధువులు ఎరుకుల హక్కుల పోరాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మతో కలసి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. ఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment