secretariat employee
-
సచివాలయ ఉద్యోగిపై ‘తమ్ముడి’ శివాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తనకు సమాచారం ఇవ్వకుండా రాయితీపై ప్రభుత్వం అందజేసే ఉలవలు ఎలా పంపిణీ చేస్తావంటూ టీడీపీ నాయకుడు వెంకటేష్ బండ బూతులతో సచివాలయ హార్టీకల్చర్ అసిస్టెంట్‌పై వీరంగం చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటలో జరిగిన ఈ ఘటన.. టీడీపీ చోటామోటా నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంపై విరుచుపడుతున్న తీరుకు అద్దంపడుతోంది.ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఉలవ విత్తనాలు అందజేస్తోంది. పరిగి మండలంలోని వ్యవసాయాధికారులు ఈ నెల 12 నుంచి ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసనకోటలో 13వ తేదీ విత్తన పంపిణీ జరగాల్సిన ఉన్నా.. స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపుతో మండల వ్యవసాయాధికారులు వాయిదా వేశారు. 14వ తేదీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కలిసి సచివాలయ ఉద్యోగులు ఆర్బీకే పరిధిలోని గ్రామ పంచాయతీ రైతులకు ఉలవ విత్తనాలను పంపిణీ చేశారు.ఆపై వరుస సెలవులు రావడంతో మంగళవారం ఉలవ విత్తనాల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రావాలని అదే రోజు సచివాలయ ఉద్యోగి పవన్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ను ఆహ్వానించేందుకు ఫోన్ చేశారు. అయితే తనకు తెలియకుండా రైతులకు విత్తనాలు ఎలా పంపిణీ చేస్తావంటూ ఆ టీడీపీ నేత వెంకటేష్ బూతు పురాణానికి తెరలేపాడు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం‘ఈ వెంకటేశ్ గాడు పెద్ద క్రిమినల్.. వైకాపా నా కొడుకులతో నీ వేషాలు సరిపోతాయి.. నాతో కాదు.. అంటూ పచ్చి బూతులతో ఆ ఉద్యోగిపై విరుచుకు పడ్డాడు. ఆ ఉద్యోగిని బండబూతులు తిట్టిన ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుడయిన శాసనకోట వెంకటేష్ ఓ అధికారిని అంతలా దూషిస్తూ మాట్లాడిన తీరు విమర్శలపాలవుతోంది. -
పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన సచివాలయం ఉద్యోగిని
కోనసీమ: ఇంజరం సచివాలయ కార్యదర్శిగా సేవలందిస్తున్న గాలిదేవర శివ గంగాదుర్గ థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్ క్రీడల్లో సత్తాచాటింది. డిస్కస్ త్రో, జెవెలెన్ త్రోలలో రెండు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. షార్ట్పుట్లో నాలుగవ స్థానంలో నిలిచింది. పతకాలు అందుకుని తాళ్లరేవు వచ్చిన శివ గంగాదుర్గకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీఓ ఎం.అనుపమ, ఈఓపీఆర్డీ మల్లాడి భైరవమూర్తి, కార్యాలయ ఏఓ చింతా మోహనకృష్ణ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది హారతులిచ్చి స్వాగతం పలికారు. దుశ్శాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి గ్రామానికి చెందిన శివ గంగాదుర్గ 2019లో ఇంజరం సచివాలయం–2లో గ్రేడ్–5 కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి సేవలందిస్తున్నారు. ఆటలపై మక్కువతోనే పారా ఒలింపిక్స్‌కు... శివ గంగాదుర్గకు చిన్నతనం నుంచి ఆటలంటే ఎంతో మక్కువ. ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న కాన్వెంట్లో చదివి, తరువాత టెన్త్ వరకు హైస్కూల్లో చదివారు. ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సమయంలో పక్షవాతం వచ్చి ఎడమ చేయి పనిచేయకుండా పోయింది. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో చదివి ఇంటర్ పూర్తిచేసింది. సుంకరపాలెం రవి కళాశాలలో బీఎస్సీ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎస్సీ స్పేస్ ఫిజిక్స్ చేసేందుకు చేరింది. ఆ సమయంలో పారా ఒలింపిక్స్ గురించి తెలుసుకుని, ఎలాగైనా పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలని కంకణం కట్టుకుంది. పీజీ పూర్తికాకుండానే సచివాలయ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసి ఉద్యోగంలో చేరింది. యానాంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా ప్రాంగణంలో పారా స్పోర్ట్స్ కోసం ప్రత్యేక తర్ఫీదు తీసుకుంది. 2021లో బిహార్‌లో జరిగిన జాతీయ స్థాయి పారా స్పోర్ట్స్‌లో డిస్కస్ త్రోలో బంగారు పతకం సాధించింది. 2022, 23లలో జరిగిన జాతీయస్థాయి పోటీలలో కూడా ప్రతిభ కనబరచడంతో ఇటీవల థాయిలాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌కు ఎంపికైంది. భారతదేశం నుంచి సుమారు 70 మంది పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్‌నుంచి ముగ్గురు మాత్రమే పాల్గొన్నారు. వీరిలో శివ గంగాదుర్గ డిస్కస్ త్రో, జావెలెన్ త్రోలలో ఎఫ్–35 విభాగంలో బంగారు పతకాలు సాధించింది. మరో క్రీడ షాట్‌పుట్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. రూ.2 లక్షల బ్యాంకు రుణం తీసుకుని... పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే రూ.2లక్షలకు పైగా ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. శివ గంగాదుర్గ ప్రతిభను గుర్తించిన రిలయన్స్ సంస్థ రూ.50 వేల సహాయం ప్రకటించింది. దీంతో మరో రూ.2 లక్షలు బ్యాంకు రుణం తీసుకుని పోటీ లకు హాజరైనట్లు శివ గంగాదుర్గ విలేకర్లకు తెలిపింది. ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, సహచర ఉద్యోగుల సహకారంతో ఈ ఘనత సాధించగలిగానని తెలి పింది. తన తండ్రి వెంకట్రామయ్య తాను 6వ తరగతి చదివే సమయంలో మృతి చెందారని, అప్పటి నుంచి తల్లి లక్ష్మి టైలరింగ్ చేస్తూ తమ కుటుంబాన్ని పోషించి తనను ఈ స్థాయికి తీసుకువచ్చినట్లు చెప్పింది. తనకు స్పాన్సర్స్ ఉంటే మరిన్ని పతకాలు సాధిస్తానని శివ గంగాదుర్గ తెలిపింది. -
పాపను బాగా చూసుకోండి.. 4 పేజీల సూసైడ్ నోట్ రాసి..
ఏలూరు: విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామ సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా పని చేస్తున్న గుణదల శిరీష(30) భర్త వేధింపులు తాళలేక సోమవారం అర్ధరాత్రి నూజివీడులోని తన పుట్టింటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు నాలుగు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుణదల శిరీషకు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం తాతకుంట్లకు చెందిన గద్దల వెంకటేశ్వరరావుతో 2018 ఆగస్టులో వివాహమైంది. వివాహమైన నాటి నుంచి నిత్యం అనుమానంతో శిరీషను వేధించేవాడు. ఆ తరువాత కొంతకాలానికి పాప పుట్టింది. 2019 నవంబరులో నున్న సచివాలయం–1లో మహిళా సంరక్షణ కార్యదర్శిగా ఉద్యోగం రావడంతో నున్నలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉండేవారు. ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరుగుతుండడంతో పెద్దలు పలుమార్లు సర్దిచెప్పి కాపురానికి పంపించేవారు.అయితే మూడు రోజుల క్రితం తలపై కొట్టడంతో తీవ్ర గాయమైంది. దీంతో శిరీష నూజివీడులోని తన పుట్టింటికి వచ్చింది. తరువాత తన అన్నను పాపను తీసుకురమ్మని పంపగా వారు పంపలేదు. దీంతో చేసేదేమీ లేక తాను చనిపోయిన తర్వాత పాపను బాగా చూసుకోవాలని తన అన్నను కోరుతూ సూసైడ్ నోట్ రాసింది. తన ఆత్మహత్యకు తన భర్తతో పాటు అత్తమామలు, ఆడబిడ్డ, చిన్న అత్తలు కారణమని లెటర్లో పేర్కొంది. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఆమె అన్న ఆమె గదిలోకి వెళ్లగా ఉరివేసుకుని ఉండడంతో వెంటనే అందరిని పిలిచి చెప్పడంతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివనారాయణ బాపూనగర్‌లోని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డీఎస్పీ ఈడే అశోక్‌కుమార్‌గౌడ్ ఏరియా ఆసుపత్రికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరించారు. సూసైడ్ లేఖ ఆధారంగా, మృతురాలి అన్న గుణదల కాశీ విశ్వనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కడుపు నొప్పితో సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య
మైదుకూరు : కడుపు నొప్పి తాళలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మైదుకూరులో జరిగింది. మృతురాలి తండ్రి యుగంధర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరు మండలం నంద్యాలంపేట –2లో మైదుకూరుకు చెందిన ధనపాల ప్రియాంక (27) అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. ఆమె కొన్నాళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. నొప్పి ఎక్కువ కావడంతో మూడు రోజుల కిందట విషద్రావణం తాగింది. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. జిల్లా వ్యవసాయాఽధికారి నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీప్రసన్న ప్రియాంక మృతదేహాన్ని పరిశీలించి, ఆమె తండ్రి యుగంధర్‌ను పరామర్శించారు. -
వితంతువులకే మొదటి ప్రాధాన్యత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులెవరినీ వారి సొంత గ్రామ పంచాయతీలకు లేదా వారి సొంత మున్సిపల్ వార్డుల పరిధిలోకి ఎట్టి పరిస్థితిలో బదిలీ చేయబోమని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ శాఖ డైరెక్టర్ లక్ష్మీశ శనివారం పూర్తి మార్గదర్శకాలను విడుదల చేశారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు పొంది.. ఈ ఏడాది మే 25 నాటికి ప్రొబేషన్ ప్రక్రియ పూర్తయిన వారు బదిలీ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇక ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు పరస్పర అంగీకార బదిలీలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. బదిలీలకు దరఖాస్తు చేసుకునే వారిపైన ఎలాంటి శాఖపరమైన క్రమశిక్షణా చర్యలు, ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యం.. ♦ కాగా బదిలీ దరఖాస్తులో సచివాలయాల ఉద్యోగులు ఐదు మండలాలు లేదా ఐదు మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్లను ప్రాధాన్యత క్రమంలో ఎంచుకునే వీలు కల్పించారు. పరస్పర అంగీకార బదిలీలకు కేవలం ఒక మండలం లేదా మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్నే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ల ద్వారా పొందిన నో డ్యూస్ సర్టిఫికెట్‌ను అప్లోడ్ చేయాలి. ♦ బదిలీలు కోరుకునేవారిలో... వితంతువులు తమ భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని, వ్యాధిగ్రస్తులు మెడికల్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. చెరొక చోట ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలకు వివాహ ధ్రువీకరణపత్రంతో పాటు భర్త లేదా భార్య ఆధార్ వివరాలు, వారి ఉద్యోగ ఐడీ కార్డు, ఉన్నతాధికారి జారీ చేసిన సర్టిఫికెట్లు ఉండాలి. వాటిని దరఖాస్తుతోపాటు జత చేయాలి. ♦ ఒక జిల్లా పరిధిలో 15 శాతం నాన్ లోకల్ నిబంధనలకు లోబడి అంతర్ జిల్లాల బదిలీలు ఉంటాయి. ఒక లోకల్ ఉద్యోగి, మరొక నాన్ లోకల్ ఉద్యోగి పరస్పర అంగీకారంతో అంతర్ జిల్లా కేటగిరీలో బదిలీ కోరుకున్నప్పుడు ఈ పరిస్థితి ఉత్పన్నమవుతుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో బదిలీపై వెళ్తున్న ఉద్యోగితో సహా కొత్తగా ఆ జిల్లాకు వచ్చే నాన్ లోకల్ ఉద్యోగి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మించి ఉన్నప్పుడు అంతర్ జిల్లాల బదిలీలకు అవకాశం ఉండదని వెల్లడించారు. ♦ బదిలీలకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించే సమయంలో మొదట జిల్లా పరిధిలో, ఆ తర్వాత దశలో మాత్రమే అంతర్ జిల్లాల బదిలీలను పరిగణనలోకి తీసుకోవాలని కలెక్టర్లతోసహా ఇతర నియామక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిధిలో బదిలీల్లో మొదట ఒంటరి మహిళ లేదా వితంతువులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆ తర్వాత వరుస క్రమంలో అనారోగ్య కారణాలు, భార్యాభర్తలు వేర్వేరు చోట్ల పనిచేస్తుండడం వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇక చివరి ప్రాధాన్యతగా పరస్పర అంగీకార బదిలీలకు వీలు కల్పించాలన్నారు. అర్హులందరికీ బదిలీలకు అవకాశం బదిలీ కోరుకునే ఏ ఒక్క ఉద్యోగికి అన్యాయం జరగకుండా.. నిర్ణీత గడువులోగా అర్హులందరికీ ప్రొబేషన్ కూడా పూర్తయ్యేలా కలెక్టర్లతో కలిసి ఆయా శాఖాధిపతులు చర్యలు చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ సూచించారు. డైరెక్టర్ లక్ష్మీశతో కలిసి శనివారం ఆయన సచివాలయాల ఉద్యోగుల బదిలీల ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖాధిపతులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. -
గొడవలతో భర్తకు దూరం.. గోపితో ప్రేమ, పెళ్లి కోసం ఆందోళన..
చీరాల రూరల్: మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి రైలుకిందపడి బలవన్మరణం చెందింది. ఈఘటన బుధవారం రాత్రి చీరాల–జాండ్రపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (30)చీరాలలోని వైకుంఠపురం విఠల్‌నగర్ సచివాలయంలో శానిటేషన్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు గతంలోనే వివాహం జరగగా కుటుంబ కలహాల నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఈమె విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో మృతురాలు లక్ష్మీప్రసన్న, గోపి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి వివాహం విషయంలో కొంత కాలంగా ఆమె ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎరుకుల హక్కుల పోరాట సమితి ధర్నా.. మృతురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తండ్రి వారి బంధువులు ఎరుకుల హక్కుల పోరాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మతో కలసి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. ఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
బీమా డబ్బుల కోసం డ్రామా
మెదక్‌జోన్: కారుతోసహా వ్యక్తి సజీవదహనమైన కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉన్నట్లు తేలింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నాటకం ఆడి అడ్డంగా పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బీమ్లా తండాకు చెందిన ధర్మానాయక్ సెక్రెటేరియేట్‌లోని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ నెల 5న స్వగ్రామానికి వచ్చా డు. 6న మిత్రులతో కలిసి బాసరకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. 7న రాత్రి ఇంటికొస్తున్నానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. 8వ తేదీ రాత్రి వెంకటాపూర్ గ్రామ శివారులో ధర్మా కారుతో సహా కాలిపోయాడనే సమాచారం అందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్ గుర్తించారు. దీంతో ధర్మా ప్రమాదంలో చనిపోయాడా? ఎవరైనా హత్య చేశారా.. అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మెస్సేజ్ ఆధారంగా గుర్తింపు.. విచారణ ప్రారంభించిన పోలీసులు ధర్మా భార్య నీల ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ధర్మా పుణెకు వెళ్లి తన భార్య ఫోన్‌కు తన డెత్ సర్టి ఫికెట్ తీసి ఇన్సూరెన్స్ డబ్బులకు దరఖాస్తు చేయాలని మెస్సేజ్ పంపాడు. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పోలీసులు పుణెలో ధర్మాను అరెస్ట్‌చేశారు. భార్యభర్తలిద్దరూ కలిసే ఈ స్కెచ్ వేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ నెల 4న ధర్మా హైదరాబాద్‌లోని అడ్డాపై ఉన్న బిహార్‌కు చెందిన ఓ వ్యక్తిని కారు డ్రైవర్‌గా పనిలో పెట్టుకున్నట్టు తెలుస్తోంది. తెలిసిన వ్యక్తిని కారు డ్రైవర్‌గా పెట్టుకుంటే చంపడం కుదరదనుకుని ఇలా ప్లాన్ చేశాడు. ధర్మా 8వ తేదీన డ్రైవర్‌కు ఫుల్‌గా మద్యం తాగించిన తర్వాత గొడ్డలితో నరికిచంపి, ఆపై కారులో మృతదేహాన్ని ఉంచి పెట్రోల్ పోసి తగులబెట్టినట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ధర్మాను పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్టు తెలిసింది. బెట్టింగ్‌లు ఆడి... ధర్మా కొంతకాలంగా ఆన్లైన్ గేమ్స్‌తోపాటు బెట్టింగ్‌లు ఆడి సుమారు రూ.2 కోట్ల వరకు పోగొట్టుకున్నట్లు తెలిసింది. దీంతో తెచ్చిన అప్పులను తీర్చే మార్గం కానరాక భారీ స్కెచ్ వేశాడు. తన పేరుపై ఉన్న 4 ఎల్ఐసీ పాలసీల క్లెయిమ్ విలువ రూ.7 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రమాదంలో చనిపోయింది ధర్మానే అనేవిధంగా నమ్మించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. కాగా, ధర్మానాయక్ తమ అదుపులోనే ఉన్నాడని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని చెప్పారు. కారు దహన ఘటనపై విచారిస్తున్నామని, బుధవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
శ్రీకాకుళం జిల్లాలో రౌడీ సేన దౌర్జన్యం
-
అధికారుల సీట్లు చిరిగిపోవడం ఖాయం!
ఇదో అద్భుతమైన కథ. కాదు కాదు... వాస్తవం! ఈ కథలో దొరికినవారు దొంగలుగా... దొరకనివారు దొరలుగా కనిపిస్తున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన కొన్ని వ్యవస్థలు తలచుకుంటే ఎంతటి తప్పునైనా చక్కగా కప్పిపుచ్చవచ్చని ఇక్కడ రుజువు చేస్తున్నారు. ఫిర్యాదు లేదు కదా... అంటూనే వారిని కాపాడటానికి ఓ అధికారి చెమటోడ్చారు.కళ్లముందు జరుగుతున్న అక్రమాన్ని ఆపలేకపోగా... కనీసం ఉన్నతాధికారులకు చెప్పేందుకు కూడా సాహసించని మరో అధికారి చక్కగా రక్తి కట్టించారు. రామభద్రపురం, విజయనగరం కార్యాలయాల వేదికగా సాగిన ఈ తతంగంపై విచారణ జరిగితే చాలామంది అధికారుల సీట్లు చిరిగిపోవడం ఖాయం. మరి అంతటి గొప్ప సాహసాన్ని ఎవరు చేస్తారో... సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలనే సత్సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగాల విప్లవాన్ని తీసుకువచ్చారు. కానీ సచివాలయాల్లో కొలువు సంపాదించిన కొందరు సీఎం ఆశయానికి తూట్లు పొడుస్తూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు రామభద్రపురం సచివాలయంలో ఉన్నారు. బొబ్బిలిలో ఉంటున్న తన బంధువు, విజయనగరం జిల్లాకేంద్రంలో ఓ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఇవ్వాల్సిన ఉద్యోగాలను పైరవీల ద్వారా ఇప్పిస్తామని నమ్మించి నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టా రు. అలా రామభద్రపురానికి చెందిన దాదాపు ఆరుగురు నిరుద్యోగుల నుంచి రూ.12లక్షలు వసూలు చేశారు. నిరుద్యోగులను, డబ్బులను తీసుకుని కలెక్టరేట్ వద్దకు వచ్చారు. అక్కడికి వచ్చాక ఫోన్ చేయగా లోపలి నుంచి ఒక ఉద్యోగి బయటకు వచ్చి వీరివద్ద ఉన్న డబ్బులు తీసుకుని పనైపోతుందని చెప్పి భరోసా ఇచ్చారు. అంతా సవ్యంగానే జరుగుతుందని వీరంతా భావించారు. ఫోర్జరీ సంతకాలతో పోస్టింగ్ ఆర్డర్స్ రూ.2 లక్షలు చొప్పున సమర్పించిన నిరుద్యోగులు తమకు నియామకపత్రాలు (అపాయింట్మెంట్ లెటర్లు) ఎప్పుడిస్తారని ఒత్తిడి తేవడంతో మరో ఎత్తుగడ వేశారు. తాత్కాలికంగా వారిని శాంతింపజేయడానికి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు తయారు చేయాలని భావించారు. దానికి అవసరమైన సరంజామా అంతా సిద్ధం చేసి, కలెక్టర్, జిల్లా పరిషత్ సీఈఓ, ఇతర అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. ఇంకేముంది కొన్ని అధికారిక ప త్రాలు రెడీ అయ్యాయి. వాటిని అభ్యర్థుల కు వాట్సప్‌ద్వారా పంపించేశారు. అక్కడే దొరికిపోయారు. అలా వెళ్లిన పత్రాలు సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పంచాయతీరాజ్ శాఖలో పోస్టులకు సంబంధించి డబ్బులు వసూళ్లవుతున్నాయ న్న ప్రచారం మొదలైంది. ఈ సంఘటన తో డబ్బులు ఇచ్చిన వారు మరింత ఒత్తిడి తెచ్చారు. పోలీసులను ఆశ్రయిస్తే డబ్బు లు తిరిగి ఇచ్చేది లేదని, ఉద్యోగాలు కూ డా రావని వారిని ఈ ముఠా బెదిరించింది. కాయకష్టం చేసి సంపాదించిన దానికి అప్పుచేసి తెచ్చిన డబ్బు జతచేసి ఇచ్చిన ఆ పేద నిరుద్యోగులు తమకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తే చాలనుకున్నారు. వారి బలహీనతను ఆసరా చేసుకుని పోలీసుల సాయంతో ఒక్కొక్కరికీ డబ్బులు సెటిల్ చేయడం ప్రారంభించారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులకు అక్కడి ఎంపీడీఓ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం విచిత్రం. జవాబులేని ప్రశ్నలెన్నో... ఈ వ్యవహారంలో సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు కొన్ని మిగిలిపోయాయి. అధికారిక పత్రాల్లో ఉన్న సంతకాలు ఫోర్జరీయేనా లేక నిజమైనవేనా? సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ సంతకాన్నే ఫోర్జరీ చేసేస్తే ఇంతవరకూ ఎవరూ ఏమాత్రం పట్టించుకోకుండా ఎందుకున్నారు? జిల్లా మేజి్రస్టేట్ సంతకాన్ని ఫోర్జరీ చేసి పత్రాలు ఇవ్వడమేగాకుండా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన వారికి పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు? నేరం జరిగినట్లు సాక్ష్యాలతో సహా కనిపిస్తున్నా, బాధితుల ఫిర్యాదు లేదంటూ ఎందుకు తప్పించుకుంటున్నారు? తన పరిధిలో జరిగిన అక్రమాలను ముందే గుర్తించలేకపోయినప్పటికీ, తర్వాతైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా తప్పుచేసిన వారిని ఎంపీడీఓ ఎందుకు కాపాడుతున్నారు? ఇంత మంది నోరునొక్కడం ఒక సచివాలయ ఉద్యోగికి సాధ్యమేనా? ఈ ఫోర్జరీ సంతకాలు ఇంకా ఎన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి., ఈ ప్రశ్నలకు సమాధాలు రావాల్సి ఉంది. నిజమే..కానీ చెప్పలేదు నిరుద్యోగుల నుంచి సచివాలయ ఉద్యోగి డబ్బు లు వసూలు చేయడం వాస్తవం. కొందరు విలేకరులు, స్థానికులు ఈ విషయం బయటకు పొక్కకుండా అతనిని కాపాడేందుకు జాగ్రత్తలు తీసుకున్నారు. బాధితులు ఏడ్చుకుంటూ వచ్చి చెబుతున్నారే కానీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మన్నా ఇవ్వడం లేదు. మీ ఫోర్జరీ సంతకంతో అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది చూడండని కలెక్టర్‌కు, సీఈఓకు నేను చెప్పగలనా, అలా చెబితే నన్ను ఉంచుతారా?. ఫిర్యాదు లేకుండా ఎలా చెప్పగలం. – బి.ఉషారాణి, ఎంపీడీఓ, రామభద్రపురం ఫిర్యాదు ఇవ్వలేదు ఉద్యోగాల కోసం వసూళ్లు చేశారనే వార్తలు ఆధారాల్లేనివి. ఈ విషయంపై మా డీఎస్పీ ద్వారా ఎస్పీ గారు కూడా అడిగి రిపోర్టు ఇమ్మన్నారు. దీంతో డబ్బులు ఇచ్చిన వారిలో ముగ్గురిని పిలిపించి విచారించాం. తాము ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని వారు చెప్పారు. అదే రిపోర్టును ఉన్నతాధికారులకు పంపించాం. – ఎస్.కృష్ణమూర్తి, ఎస్ఐ, రామభద్రపురం -
కరోనా కట్టడికి మేము సైతం..
సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల కోసం ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యల్లో ఉద్యోగులందరం పాల్గొంటున్నామని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నామని చెప్పారు. రవాణా సదుపాయాలు లేనందున ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. (ఏపీ లాక్డౌన్ : ఈ సేవలకు మినహాయింపు) రవాణా సదుపాయం ఉన్న ఉద్యోగులందరం సచివాలయానికి వచ్చి పని చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలను పరిశీలించాలని వెంకట్రామిరెడ్డి సూచించారు. (తెలంగాణలో 30కి చేరిన కరోనా కేసులు) -
విధులు మరచి.. ‘పచ్చ’ సేవలో తరించి..
అనంతపురం, చెన్నేకొత్తపల్లి: సచివాలయ ఉద్యోగి తన ఉద్యోగ ధర్మాన్ని కాలరాశాడు. తనొక ఉద్యోగినన్న విచక్షణ మరచి రాజకీయ పార్టీ పంచన చేరి కార్యకర్తలా మారిపోయాడు. ఎవరేమి అనుకుంటే తనకేమి అంటూ ‘పచ్చ’ కార్యకర్తలా చెలరేగిపోతున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన అశోక్‌కుమార్ బసంపల్లి సచివాలయంలో జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అయితే అశోక్‌కుమార్ మాజీ మంత్రి పరిటాల సునీతకు మద్దతుగా టీడీపీ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొంటూ వృత్తి ధర్మాన్ని విస్మరిస్తున్నాడు. జనవరిలో చెన్నేకొత్తపల్లి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర వర్ధంతికి హాజరై నివాళులర్పించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. గ్రామస్తులను సైతం టీడీపీ కార్యక్రమాల్లో హాజరు కావాలంటూ ప్రోత్సహిస్తున్నాడు. విధులు నిర్వహించే బసంపల్లి పంచాయతీ కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం సైతంనిర్వహిస్తున్నాడు. ♦ ఈ నెల 29న జరగనున్న మాజీ మంత్రి పరిటాల సునీత రెండో కుమారుడి వివాహానికి రావాలంటూ టీడీపీ నాయకులతో కలిసి ఆహ్వానపత్రికలు పంచుతూ విధులకు పూర్తిగా ఎగనామం పెడుతున్నాడు. బసంపల్లిలో సచివాలయం ప్రారంభం కాకపోవడంతో సదరు ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న అశోక్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే విషయమై చెన్నేకొత్తపల్లి ఎంపీడీవో సోనీబాయిని వివరణ కోరగా సచివాలయ ఉద్యోగి అశోక్‌కుమార్ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఏ సచివాలయ ఉద్యోగి కూడా రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేశారు. సదరు ఉద్యోగిపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ మంత్రి కుమారుడి పెళ్లి పత్రికలు పంచుతున్న అశోక్‌కుమార్ (వృత్తంలోని వ్యక్తి) -
కేటరింగ్ కాంట్రాక్టు కావాలా నాయనా..!
► సెక్రటేరియట్ ఉద్యోగి ఘరానా దందా ► పాస్‌ల కోసం డిపాజిట్ల పేరుతో బురిడీ సాక్షి, అమరావతి బ్యూరో : వెలగపూడి సెక్రటేరియట్లో కేటరింగ్ కాంట్రాక్టులు ఇప్పిస్తామని ఓ ఉద్యోగి పలువురిని బురిడీ కొట్టిస్తున్నారు. ఏకంగా తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకుని ఆ తరువాత పత్తా లేకుండా పోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే పేరు చెబుతూ మాయ చేస్తున్నారు. ఫోన్ల ద్వారానే బోల్తా కొట్టిస్తున్న ఈ ఘరానా మోసగాడి ఉదంతం ఇదిగో ఇలా ఉంది... విజయవాడలోని ఓ కేటరింగ్ సర్వీసు యజమానులకు కొన్నిరోజుల క్రితం ఒకరు ఫోన్ చేశారు. తనని తాను సెక్రటేరియట్‌లోని బీ సెక్షన్లో పనిచేసే త్రివిక్రమ్‌గా పరిచయం చేసుకున్నారు. ‘సెక్రటేరియట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఈ నెల 17, 18, 19 తేదీలలో మూడురోజులపాటు సెమినార్ ఉంది... అందుకు కాఫీ, టిఫిన్లు, భోజనాలు సరఫరా చేయాల్సి ఉంటుంది’అని తెలిపారు. ‘టీడీపీ ఎమ్మెల్యే’ మీ కేటరింగ్ పేరు సూచించారు. అందుకే మీకు ఫోన్ చేశాం’అని కూడా అన్నారు. దాంతో ఆ కేటరింగ్ యజమానులు నిజమేనని నమ్మారు. ‘కేటరింగ్ కాంట్రాక్టు కావాలంటే మీకు, మీ వాహనాలు సెక్రటేరియట్‌లోకి ప్రవేశించేందుకు పాస్ ఉండాలి. అందుకు మీరు బ్యాంకు ఖాతాలో రూ.11,600 చెల్లించండి. ఆ బ్యాంకు రశీదు నంబర్ మాకు వాట్సాప్‌లో పంపండి. అప్పుడు మీకు సెక్రటేరియట్లో ప్రవేశానికి పాస్ ఇస్తాం. అనంతరం సెక్రటేరియట్‌కు వస్తే కాంట్రాక్టు ఖాయం చేస్తాం’అని తెలిపారు. మర్నాడు మరొకరు జానకీరామయ్య అనే ఆయన కూడా ఫోన్ చేసి తాను సెక్రటేరియట్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు. త్రివిక్రమ్ అనే సెక్రటేరియట్ ఉద్యోగి చెప్పడంతో తాను ఫోన్ చేస్తున్నానని అన్నారు. కేటరింగ్ కాంట్రాక్టు కావాలంటే సెక్రటేరియట్ పాస్ కోసం రూ.11,600 చెల్లించాలని చెప్పారు. ఆంధ్రాబ్యాంకు ఖాతాలో (నంబర్ 165910100030956)లో నగదు డిపాజిట్ చేయమని చెప్పారు. వాస్తవానికి ఆ బ్యాంకు ఖాతా నేలపట్ల రాకేష్ అనే పేరున ఉంది. కానీ ఇదేమీ పెద్దగా పట్టించుకోకుండా ఆ కేటరింగ్ సర్వీసు యజమానులు ఆ బ్యాంకు ఖాతాలో రూ.11,600 చెక్కును తమ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా డిపాజిట్ చేశారు. ఆ విషయాన్ని తమకు ఫోన్‌చేసిన వారికి చెప్పారు. దానిపై ఆయన స్పందిస్తూ ‘అసలు చెక్ ఎందుకు వేశారు. నగదు వేయాలి కదా’అని అన్నారు. మరోసారి నగదు రూ.11,660 డిపాజిట్ చేయమని చెప్పారు. దాంతో కేటరింగ్ సర్వీసు యజమానులు నిజమేనని నమ్మి మరోసారి రూ.11,660 నగదును ఆ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశారు. అంటే మొత్తం మీద 23,260 చెల్లించారు. నగదు డిపాజిట్ చేసిన విషయాన్ని కేటరింగ్ సర్వీసు యజమానులు త్రివిక్రమ్‌కు ఫోన్ చేసి చెప్పారు. విజయవాడ కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వద్దకు వస్తే సెక్రటేరియట్ పాస్‌లు ఇస్తామని ఆయన తెలిపారు. దాంతో కేటరింగ్ ప్రతినిధులు మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. అదిగో వస్తాను ఇదిగో వస్తాను అంటే అక్కడే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు నిరీక్షించారు. కానీ ఆయన రానేలేదు. సాయంత్రం ఫోన్లో అందుబాటులోకి వచ్చి బుధవారం నేరుగా సెక్రటేరియట్‌కు వస్తే పాస్‌లు ఇస్తామ న్నారు. దాంతో బుధవారం వెలగపూడి వెళ్లి సెక్రటేరియట్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరీక్షించారు. కానీ త్రివిక్రమ్ రానేలేదు. కొన్నిసార్లు ఫోన్లో అందుబాటులోకి వచ్చిన ఆయన తరువాత తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. దాంతో తాము మోసపోయామని కేటరింగ్ సర్వీసు యజమానులు గుర్తించారు. తమలాగే నగరానికి చెందిన మరో కేటరింగ్ సర్వీసు యజమానులు కూడా మోసపోయారని తెలుసుకున్నారు. కొసమెరుపు ఏమిటంటే.... త్రివిక్రమ్, జానకీరామయ్య పేర్లతో వచ్చిన ఫోన్ నెంబర్లను ట్రూకాలర్‌లో పరిశీలిస్తే ఆ రెండు కూడా రాకేష్ అనే పేరు తోనే ఉన్నాయి. అంటే రాకేష్ అనే వ్యక్తే త్రివిక్రమ్, జానకీరామయ్యల పేర్లతో ఫోన్ చేసి బురిడీ కొట్టించారు. తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకుని మోసానికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది. -
సచివాలయ ఉద్యోగ సంఘాల ఆగ్రహం
హైదరాబాద్: పీఆర్సీ(పే రివిజన్ కమిషన్) విషయంలో ఏపీ ప్రభుత్వం మెలికపెట్టడంపై సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాస్టర్ స్కేల్లో మార్పుల ప్రతిపాదనను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మాస్టర్ స్కేల్లో మార్పులు చేస్తే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల 50వేల మంది పెన్షనర్లపై ఆ ప్రభావం పడుతుందని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆ సంఘాలు విమర్శించాయి. గత 9 పీఆర్సీలకు లేని విధానం ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా పీఆర్సీ అమలు చేసిందో, ఏపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా చేయాలని ఈ సంఘాలు డిమాండ్ చేశాయి. -
సెక్రటేరియట్లో చర్చలు జరపనున్న సీఎం కిరణ్