కరోనా కట్టడికి మేము సైతం.. | AP Secretariat Employees Contribution Of One Day Basic Pay To CM Relief Fund | Sakshi
Sakshi News home page

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఒక రోజు వేతనం జమ చేస్తాం

Published Mon, Mar 23 2020 2:30 PM | Last Updated on Mon, Mar 23 2020 2:47 PM

AP Secretariat  Employees Contribution Of One Day Basic Pay To CM Relief Fund - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణ చర్యల కోసం ఒక రోజు వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తామని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ చర్యల్లో ఉద్యోగులందరం పాల్గొంటున్నామని పేర్కొన్నారు. సచివాలయ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నామని చెప్పారు. రవాణా సదుపాయాలు లేనందున ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని కోరారు. (ఏపీ లాక్‌డౌన్‌ : ఈ సేవలకు మినహాయింపు)

రవాణా సదుపాయం ఉన్న ఉద్యోగులందరం సచివాలయానికి వచ్చి పని చేస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆర్డినెన్స్‌ ద్వారా బడ్జెట్‌ను ఆమోదించే అవకాశాలను పరిశీలించాలని వెంకట్రామిరెడ్డి సూచించారు.
(తెలంగాణలో 30కి చేరిన కరోనా కేసులు)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement