
సాక్షి, ఆంధ్రప్రదేశ్: ఏపీలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1,15,275 కరోనా టెస్టులు నిర్వహించగా వీరిలో 18,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 71 మృత్యువాతపడ్డారు. ఇక ఆదివారం రోజు 10,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు ఇప్పటివరకు 10,03,935 మంది సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నారు.
ఏపీలో ప్రస్తుతం1,51,852 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా బారినపడిన వారి సంఖ్య 11,63,994కు చేరింది. ఇప్పటి వరకు 8, 207మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో నిన్నటి వరకు 1,67,18,148 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
గత 24 గంటల్లో జిల్లాలవారీగా నమోదైన కరోనా కేసులు
Comments
Please login to add a commentAdd a comment