సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తనకు సమాచారం ఇవ్వకుండా రాయితీపై ప్రభుత్వం అందజేసే ఉలవలు ఎలా పంపిణీ చేస్తావంటూ టీడీపీ నాయకుడు వెంకటేష్ బండ బూతులతో సచివాలయ హార్టీకల్చర్ అసిస్టెంట్‌పై వీరంగం చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటలో జరిగిన ఈ ఘటన.. టీడీపీ చోటామోటా నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంపై విరుచుపడుతున్న తీరుకు అద్దంపడుతోంది.
ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఉలవ విత్తనాలు అందజేస్తోంది. పరిగి మండలంలోని వ్యవసాయాధికారులు ఈ నెల 12 నుంచి ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసనకోటలో 13వ తేదీ విత్తన పంపిణీ జరగాల్సిన ఉన్నా.. స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపుతో మండల వ్యవసాయాధికారులు వాయిదా వేశారు. 14వ తేదీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కలిసి సచివాలయ ఉద్యోగులు ఆర్బీకే పరిధిలోని గ్రామ పంచాయతీ రైతులకు ఉలవ విత్తనాలను పంపిణీ చేశారు.
ఆపై వరుస సెలవులు రావడంతో మంగళవారం ఉలవ విత్తనాల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రావాలని అదే రోజు సచివాలయ ఉద్యోగి పవన్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ను ఆహ్వానించేందుకు ఫోన్ చేశారు. అయితే తనకు తెలియకుండా రైతులకు విత్తనాలు ఎలా పంపిణీ చేస్తావంటూ ఆ టీడీపీ నేత వెంకటేష్ బూతు పురాణానికి తెరలేపాడు.
ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం
‘ఈ వెంకటేశ్ గాడు పెద్ద క్రిమినల్.. వైకాపా నా కొడుకులతో నీ వేషాలు సరిపోతాయి.. నాతో కాదు.. అంటూ పచ్చి బూతులతో ఆ ఉద్యోగిపై విరుచుకు పడ్డాడు. ఆ ఉద్యోగిని బండబూతులు తిట్టిన ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుడయిన శాసనకోట వెంకటేష్ ఓ అధికారిని అంతలా దూషిస్తూ మాట్లాడిన తీరు విమర్శలపాలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment