
మోదీ నివాసానికి వెళ్లిన సోనియా, మన్మోహన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కీలకమైన జీఎస్టీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆహ్వానించారు.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. జీఎస్టీ బిల్లుతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని చర్చించారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన అధికార నివాసానికి సోనియా వెళ్లడం ఇదే తొలిసారి.