
లండన్: భారీ రుణఎగవేతదారుడు, మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యా(61)పై లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎట్టకేలకు విచారణ ప్రారంభం కానుంది. అయితే మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం నుండగా ఆకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడంతో హై డ్రామా నెలకొంది. దీంతో దాదాపు గంటన‍్నరపాటు విచారణ నిలిపి వేసినట్టు తెలుస్తోంది. విజయ్‌మాల్యా కోర్టు ప్రాంగంణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ ఏరియాను ఖాళీ చేయాల్సిందిగా అలారం మోగింది. దీంతో ఆ కోర్టు ఆవరణను ఖాళీ చేస్తున్నారు. పరిస్థితి చక్కబడిన అనంతరం ట్రయిల్ ప్రారంభం కానుందని భావిస్తున్నారు.
రూ.9వేలకోట్లకు పైగా రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు చెక్కేసిన మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ విచారణ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే లండన్ చేరుకున్న సీబీఐ బృందం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ టీం కూడా కోర్టులో విచారణ కోసం ఎదురు చూస్తోంది. దాదాపు పది రోజులపాటు ఈ విచారణ జరగనుంది. 2018 జనవరి చివరినాటికి గానీ, ఫిబ్రవరి మొదటి వారానికి గానీ తీర్పు వెలువడవచ్చని అంచనా.
మరోవైపు ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ మాల్యా ఎప్పటిలాగానే వాదించాడు. తనపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలన్నీ తప్పు, కల్పితాలు, నిరాధారమైనవని వాదించాడు. కేసు విచారణలో ఉండగా తానేమీ వ్యాఖ్యానించలేనంటూ మీడియాపై అసహనాన్ని ప్రకటించాడు. గెలుపు ఓటములు తన చేతిలో లేవనీ.. కోర్టు నిర్ణయిస్తుందని మాల్యా వ్యాఖ్యానించాడు.