సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో నిలిచిపోయిన ప్రత్యక్ష విచారణ పద్ధతి వచ్చే వారం నుంచి మళ్లీ మొదలయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టుతో పాటు కొన్ని ఎంపిక చేసిన న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణను మొదలుపెట్టేందుకు ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులోని మొత్తం 15 బెంచ్‌లలో కనీసం రెండు మూడు బెంచ్‌లలో ప్రత్యక్ష విచారణ చేపట్టాలని కమిటీ సూచించింది. దీంతో వచ్చే వారం నుంచి కొన్ని అదనపు రక్షణ ఏర్పాట్లతో విచారణ ప్రారంభమయ్యే అవకాశముంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 25న దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది మొదలు, సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే కేసుల విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిల ప్యానెల్ మంగళవారం సమావేశమైందని, రెండు మూడు సుప్రీంకోర్టు బెంచ్‌లలో ప్రత్యక్ష విచారణ చేపట్టడాన్ని పరిగణిస్తున్నట్లు తెలిపిం దని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అధ్యక్షుడు శివాజీ ఎం.జాధవ్ తెలిపారు.
చదవండి: గహ్లోత్, పైలట్ షేక్‌హ్యాండ్!
Comments
Please login to add a commentAdd a comment